Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ సినిమాలతో రాజకీయాలతో ఫుల్ బిజీ గా వున్నారు. ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజు కి పెరిగిపోతూ వస్తోంది. నేతల నామినేషన్లతో సందడి వాతావరణం నెలకొంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసారు. పిఠాపురం నుండి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎన్నికలు అఫిడవిట్ బయటకి వచ్చింది అప్పులు ఆస్తులు వివరాలు పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ గత ఐదు ఏళ్లలో 114.76 కోట్లు సంపాదించారు.
Advertisement
ప్రభుత్వానికి 73.92 కోట్ల రూపాయల పన్నుల రూపంలో చెల్లించారు ఈ ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ భారీగా విరాళాలు ఇచ్చారు. ఏకంగా 20 కోట్లు దానధర్మాలు చేశారు. ఇన్ని ఆస్తులు సంపాదించిన పవన్ కళ్యాణ్ కి భారీగా అప్పులు ఉన్నాయి తనకి 64.26 కోట్ల అప్పులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నామినేషన్ తర్వాత మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఈసారి జనసేన తప్పకుండా అధికారంలోకి వస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. తన కోసం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పిఠాపురం సీటుని త్యాగం చేశారని, వర్మను భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతానని అన్నారు.
Advertisement
Also read:
Also read:
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి జనసేన బిజెపి పార్టీలు కూటమిగా జతకట్టి పోటీ చేస్తున్నాయని ఈసారి వైసిపిని ఓడించి అధికారంలోకి వస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి తరపున పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి ఎన్నికల బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరం రెండు చోట్ల నుండి కూడా పోటీ చేసారు కానీ రెండు నియోజకవర్గాల్లో కూడా ఓటమిపాలయ్యారు. జనసేన నుండి రాజోలు ఒక్క సీటు గెలిచారు కానీ రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ కూడా కొన్ని రోజులయ్యాక జనసేన ని వదిలిపెట్టేసి వైసిపిలో చేరిపోయారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!