Home » చంద్రబాబు బెయిల్‌ వెనుక… పవన్ కల్యాణ్….!

చంద్రబాబు బెయిల్‌ వెనుక… పవన్ కల్యాణ్….!

by Sravya
Ad

చంద్రబాబు నాయుడుని స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసింది అయితే ఇప్పటికీ బెయిల్ వచ్చింది. చంద్రబాబు కి బెయిల్ రావడంతో 50 రోజుల పాటు టిడిపి నేతలు నిరీక్షణకు తెరపడినట్లు అయింది. చంద్రబాబు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడప్పుడే చంద్రబాబు బయటకు రారని రావడం కష్టమని టిడిపి నేతలు భావించారు. అందరి ఆలోచనలని తలకిందులుగా చేస్తూ కోర్టు అనూహ్యంగా చంద్రబాబుకి షరతులు పెట్టి బెయిల్ మంజూరు చేసింది.

Advertisement

కంటి ఆపరేషన్ చేసుకోవాలని అవకాశం ఇవ్వాలని ఆయన తరపున న్యాయవాదులు కోరడంతో మధ్యంతర బెయిల్ వచ్చింది చంద్రబాబు బయటకు రావడంతో టిడిపి నేతలు సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆయన బయటికి రాగానే టిడిపి నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వైసిపి టిడిపి నేతల మధ్య చంద్రబాబు బెయిలు విషయంలో మాటల యుద్ధం నడుస్తోంది చంద్రబాబు బయటకి వచ్చారు దాంతో న్యాయం గెలిచింది, ధర్మం గెలిచిందని టిడిపి క్యాడర్ సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు.

Advertisement

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని చూసి మాత్రమే బెయిల్ ఇచ్చారని ఒకపక్క వైసిపి నేతలు గుర్తు చేయడం జరుగుతోంది. చంద్రబాబుకి కేవలం బెయిల్ మాత్రమే వచ్చిందని టిడిపి గుర్తుంచుకోవాలని న్యాయస్థానం ఎక్కడా కూడా నిర్దోషి అని చెప్పలేదని వైసిపి చెప్తోంది. జగన్ ఇంగ్లాండ్ లో ఉండి అరెస్ట్ చేస్తే పవన్ ఇటలీలో ఉండే బెయిల్ ఇప్పించాడు అంటూ జనసేన కార్యకర్తలు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading