Home » “పరుగు” మూవీ హీరోయిన్ షీలా కౌర్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!

“పరుగు” మూవీ హీరోయిన్ షీలా కౌర్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!

by AJAY
Published: Last Updated on
Ad

కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటిగా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ షీలా కౌర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలనటిగా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన షీలా… నవదీప్ హీరోగా రూపొందినటువంటి సీతాకోక చిలుక అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

 

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించలేకపోయినప్పటికీ ఈ మూవీలో తన అందచందాలతో… నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా షీలాకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు అల్లు అర్జున్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన “పరుగు” సినిమాలో అవకాశం దక్కింది.

Advertisement

ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదలై భారీ విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా షీలా క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత పలు మూవీలలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటించినప్పటికీ ఆ సినిమాలు ఆశించిన స్థాయి విజయాలను సాధించకపోవడంతో ఆ తరువాత ఈ నటికీ అవకాశాలు మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చాయి. దానితో షీలా కూడా పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటుంది.

ఇలా ఇప్పటికే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటున్న ఈనటి కి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటించిన కాలం కంటే అందంగా ఉండడంతో మళ్లీ మీరు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలి అంటూ పలువురు నెటిజన్లు ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు కామెంట్లు పెడుతున్నారు. మరి అభిమానుల కోరికను నెరవేర్చడానికి షీలా మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

Visitors Are Also Reading