సాధారణంగా చిన్న వయస్సులో పిల్లలకు ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలనే ఆలోచన, ఆతృత ఉంటుంది. ముఖ్యంగా సమాచారం, సమాధానం కోసం తల్లిదండ్రుల వద్ద, బంధువుల దగ్గర ఎక్కువగా స్నేహితుల మీద కొంత వరకు ఆధారపడి ఎదుగుతారు పిల్లలు.
Advertisement
ఇలాంటి స్థితిలోనే అందరూ ఎదిగి పెద్ద వారు అవుతారు. అందులోకి మనం కూడా వస్తాం. ఈ విషయాన్ని పెద్దలు గమనించి సంయమనం కోల్పోకుండా సహనంతో సమాధానాలు చెప్పడం.. తెలియని వాటిని నిజాయితీగా ఒప్పుకోగలిగితే ఆ మనస్తత్వాలు పిల్లలకూ వచ్చే అవకాశాలుంటాయి. వారి వ్యక్తిత్వ వికాసంలో కీలక పాత్రలు పోషిస్తాయి.
పిల్లలు అడిగే ప్రశ్నలను సాధారణంగా మనం ఎదురు చెబుతావా అని నిలదీస్తే పిల్లలు తమ ఆలోచనలు తమలోనే అగణదొక్కి.. మొండిగా ఎదురు తిరిగే మనస్తత్వాలు కలవారు గాను కొరకరాని కొయ్యలు కొయ్యలుగా ఎదిగి తమకు కుటుంబానికి, సమాజానికి ఇబ్బందులు తెస్తారు. మనకు తెలియని ప్రశ్నలను తెలుసుకుని తరువాత చెబితే అందరూ సంతోషంగా ఉంటారు. అలవాటుగా మారి ప్రవర్తనలో నిజాయతీ చేరి ఉపయోగపడే వారిగా ఎదుగుతారు. మరో ముఖ్యమైన విషయం ఎలా అదుపు చేయడం అనే ప్రశ్న సమాధానం లేని ప్రశ్నగానే మిగులుతుంది. ఎందుకంటే.. పిల్లల ఎదిగే మెదళ్లు తప్పించుకునేదానికి తెలివితేటలు నిరూపించడంపైనే నిలిపే దాని వల్ల మన భావాలు అభిప్రాయాలు అర్థం చేసుకునే అవకాశాలు తగ్గి వారి ప్రశ్నలకు సమాధానం వేరేవిధంగా తెలుసుకునే ప్రయత్నంలో దారి తప్పే అవకాశాలు మనమే ఇచ్చిన వారం అవుతాం.
Advertisement
ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల ముందు కొన్ని అనరాని మాటలను అనకపోవడం చాలా ఉత్తమం. పిల్లలను కన్న తల్లిదండ్రులు పిల్లలను వల్గర్ గా మాట్లాడటం వల్ల ఈ విషయాలను ఎవ్వరితో షేర్ చేసుకోలేక బాధపడుతుంటారు. మనం మాట్లాడే మాట కూడా బాణంలా గుచ్చుకుంటుంది. తల్లిదండ్రులకు ఎవరికైనా కోపం వస్తుంది. తల్లిదండ్రులు ఎందుకు పుట్టావు అనవసరంగా భూమి మీద నువ్వు.. నీకు ఏ పని చేతకాదు.. నీవల్లే నాకు మనశ్శాంతి లేదు. నీవల్లే దరిద్రం వంటి మాటలను పిల్లల ముందు తల్లిదండ్రులు అస్సలు అనకపోవడం చాలా మంచిది. కొన్నిసందర్భాల్లో ఇలాంటివి ప్రాణాల మీదికి వచ్చే అవకాశముంది జాగ్రత్త.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
నాగార్జున ఫస్ట్ భార్యకు ఆ విషయంలో అహంకారం ఉండటం వల్లే విడాకులు ఇచ్చారా..?