Home » నాగార్జున ఫస్ట్ భార్యకు ఆ విషయంలో అహంకారం ఉండటం వల్లే విడాకులు ఇచ్చారా..?

నాగార్జున ఫస్ట్ భార్యకు ఆ విషయంలో అహంకారం ఉండటం వల్లే విడాకులు ఇచ్చారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ అంటే చాలామందికి ముందుగా గుర్తుకువచ్చేది నాగేశ్వరరావు గారు మాత్రమే. ఆయన ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా తెలుగు ఇండస్ట్రీని ఒక లెవెల్ లో ఉంచారని చెప్పవచ్చు. ఆయన అంతటి కృషి చేశారు కాబట్టే ప్రస్తుతం హైదరాబాదులో తెలుగు ఇండస్ట్రీ ఇంత పేరు తెచ్చుకుంటుంది. అలాంటి ఏఎన్ఆర్ నట వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. అలాంటి నాగార్జున ఎవరికి కూడా ఇప్పటివరకు ఏ అన్యాయం చేయలేదు. కేవలం తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తప్పు తప్ప ఆయనపై ఎలాంటి రూమర్స్ లేవు. మరి నాగార్జున తన మొదటి భార్యకు ఎందుకు విడాకులు ఇచ్చారో అసలు విషయం బయటకు వచ్చింది.. మరి అందులో నిజమేంటో ఇప్పుడు చూద్దాం..

Advertisement

అప్పట్లో పెళ్లి అంటే నూరేళ్ల పంట అని అనేవారు.. కానీ ఇప్పుడు పెళ్లంటే విడాకుల మంట అనే పరిస్థితికి వస్తున్నాయి చాలా జంటలు. ఇక ఇండస్ట్రీలో అయితే చాలామంది జంటలు చిన్నచిన్న గొడవలు వస్తే చాలు విడాకుల వైపే చూస్తారు. అలా నాగార్జున కూడా తన మొదటి భార్యకు ఉన్న అహంకారం వల్లే విడాకులు ఇచ్చారట. మరి ఆమెకు ఏ విషయంలో అహంకారం ఉండేదో ఇప్పుడు చూద్దాం.. నాగార్జున అమల కంటే ముందు లక్ష్మీని పెళ్లి చేసుకున్నారు. లక్ష్మీ ఇండస్ట్రీలోనే బడా ఫ్యామిలీకి చెందిన రామానాయుడు కూతురు. అయితే నాగార్జున పెళ్లి కాకముందు అమెరికాలో ఇంజనీర్ గా పనిచేసేవారు. ఈ టైంలోనే ఆయనకు వివాహమైంది.

Advertisement

ఇద్దరు బడా ఫ్యామిలీకి చెందిన వారే కావడంతో లక్ష్మికి ఎప్పుడు కూడా నాదే పై చేయిగా ఉండాలని అహంకారం చూపించేదట. అంతేకాదు నాగార్జున హీరో అవడం ఆమెకు అసలు ఇష్టం లేదట. కానీ నాగార్జున హీరో కావాలని కోరిక ఆయన మనసులో బలంగా ఉండేదట. ఆమె అమెరికాలోనే ఉండి సెటిలైదామని చెబితే , నాగార్జున నేను ఇండస్ట్రీలోకి వెళ్తానని గట్టిగా చెప్పాడట. ఈ విధంగా వీరిద్దరి మధ్య నాలుగేళ్ల పాటు గొడవలు సాగాయి. అప్పటికి నాగచైతన్య పుట్టారు.. ఇక లక్ష్మీ ఎంత చెప్పినా వినకపోవడంతో నటనపై తన కోరికను చంపుకోలేక ఆమెకు విడాకులు ఇచ్చారట. తర్వాత ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగారు నాగార్జున.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు:

 

Visitors Are Also Reading