Home » తమ పిల్లల్లకి పెళ్లి చేసేముందు తల్లి దండ్రులు తప్పక తెలుసుకోవలసిన 5 విషయాలు..!

తమ పిల్లల్లకి పెళ్లి చేసేముందు తల్లి దండ్రులు తప్పక తెలుసుకోవలసిన 5 విషయాలు..!

by AJAY
Ad

ప్ర‌తిఒక్క‌రి జీవితంలో వివాహం అనేది చాలా ముఖ్య‌మైన‌ది. పెళ్లి విష‌యంలో ప్ర‌తిఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఎందుకంటే పెళ్లికి ముందు జీవితం వేరు ఆ త‌ర‌వాత వ‌చ్చే జీవితం వేరు. పెళ్లి త‌ర‌వాత భార్య‌కు అయినా భ‌ర్త‌కు అయినా బాధ్య‌త‌లు పెరుగుతాయి. అంతే కాకుండా కేవ‌లం పాతికేళ్లు మాత్ర‌మే త‌ల్లిదండ్రుల‌తో ఉంటే మిగ‌తా జీవితం మొత్తం జీవిత భాగ‌స్వామితోనే గ‌డ‌పాల్సి ఉంటుంది.

Advertisement

ఇక పెళ్లి విష‌యంలో ఇరువురి తల్లిదండ్ర‌ల పాత్ర ఎంతో ముఖ్య‌మైన‌ది. పెళ్లి త‌ర‌వాత జీవితం వేరుగా ఉంటుంది కాబ‌ట్టి త‌ల్లి దండ్రులు ముందే త‌మ పిల్ల‌ల‌ను పెళ్లికి సిద్దం చేయాలి. అబ్బాయి త‌ల్లిదండ్రులు మేము అబ్బాయి పేరెంట్స్ అని గొప్ప‌ల‌కు పోకూడ‌దు. వ‌చ్చే కోడ‌లికి స‌రిపోయేలా త‌మ ఇంటివాతావ‌ర‌ణాన్ని సిద్దం చేయాలి. రాబోయే కోడ‌లికి కంఫ‌ర్ట్ గా ఉండేలా తాము కూడా ముందే అన్ని విదాలా సిద్దం కావాలి.

Advertisement

కోడ‌లు రాగానే త‌మ ప‌ద్ద‌తుల‌ను పూర్తిగా వివ‌రించాలి. అలా చేయ‌డం వ‌ల్ల వ‌చ్చిన కోడ‌లు త‌న ప‌ద్ద‌తుల‌ను మార్చుకుంటుంది. ఇంట్లో ఏమైనా గొడ‌వ‌లు ఉన్నా వాటిని ముందే ప‌రిష్క‌రించుకుని ఆ గొడ‌వ‌ల‌కు పులిస్టాప్ పెట్టాలి. ఇక అమ్మాయిల త‌ల్లి దండ్రుల విష‌యానికి వ‌స్తే పెళ్లికి ముందే త‌మ కూతురుకు కొత్త వాతావ‌ర‌ణానికి వెళుతున్నావ్ కాబ‌ట్టి అక్క‌డ అడ్జ‌స్ట్ అవ్వ‌డం నేర్చుకోవాలని సూచించాలి.

అత్త మామ‌ల‌తో ప్రేమగా ఉండాల‌ని చెప్పాలి. ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చినా తొంద‌ర ప‌డ‌కుండా అత్తామామ‌ల‌కు వివ‌రించాల‌ని తెలపాలి. భ‌ర్త‌తో ప్రేమ‌గా ఉండాలని సూచించాలి. ఎలాంటి క‌ష్టం వ‌చ్చినా తాము అండ‌గా ఉంటామ‌ని ధైర్యంగా వెళ్ల‌మ‌ని చెప్పాలి. అలా త‌ల్లిదండ్రులు ధైర్యం చెబితే కొత్త ఇంటికి వెళ్లే కూతురుకు ఏం జరిగినా నాకు నా కుటుంబం ఉంది అనే ధైర్య ఉంటుంది.

Visitors Are Also Reading