Ad
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చాలా జాగ్రత్తగా, ఆరోగ్యంగా పెంచాలి అని అనుకుంటారు. అలానే చేస్తుంటారు. కానీ అందులోనే కొన్ని విషయాలలో తప్పులు కూడా చేస్తారు. అవి ఆ పిల్లల జీవితంలో పెద్ద మార్పులు తీసుకువస్తాయి. ముఖ్యంగా పిల్లల ఫుడ్ విషయంలో పెద్దలు ఎక్కువ తప్పులు చేస్తారు . ఇప్పుడు అవేంటో మనం చూద్దాం..!
పాలలో ఎక్కువ పోషక పదర్శలు ఉంటాయి అనేది అందరికి తెలిసిందే. అందుకే తల్లులు తమ పిల్లలు తాగకపోయిన బలవంతంగా పాలు తాగిస్తారు, అంది మంచిదే… కానీ ఆ పాలలో చెక్కర వేయడం అనేది మంచిది కాదు. ఉత్త పాలు పిల్లలు తాగడం లేదు అని చాలా మంది తల్లులు అందులో షుగర్ వేసి ఇస్తారు. అలా చేయకూడదు.
ఇక పిల్లలు ఎక్కువగా ఇష్టపడేవి చాకోలెట్స్. అవి తినకూడదు..అవి తింటే పళ్ళు పాడవుతాయి. కాబట్టి ఫ్రూట్స్ తినాలి అని చెబుతారు. కానీ ఫ్రూట్స్ తింటే వచ్చే లాభాల గురించి మాత్రం చెప్పారు. ఎప్పుడు తింటే ఏం నెగెటివ్ జరుగుతుందో మాత్రమే చెప్పడం కాకుండా… వేరేవి తింటే జరిగే పాజిటివ్ గురించి కూడా చెప్పడం వారి ఆలోచనల్లో మార్పు తెస్తుంది.
ఇవి కూడా చదవండి :
Advertisement