పారాసెటమాల్ ప్రతి ఇంట్లో అందుబాటులో ఉండే ఓ సాధారణ టాబ్లెట్. ఎసీటమైనోఫెన్, పెయిన్ కిల్లర్, యాంటీపైరేటిక్ వంటి అనేక పేర్లతో పిలవబడే ఈ మాత్ర జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి మొదలైన సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే ప్రతి దానికి పారాసిటమాల్ గుటుక్కున మింగుతున్నారా, అయితే ఈ విషయాలు తెలుసుకోండి. హార్ట్ ఎటాక్స్ కారణాల్లో బీపి ప్రధానమైంది. ఇలా బీపీ పెరగడానికి సోడియం అంటే ఉప్పు ప్రధాన కారణం.
READ ALSO : Naveen Case: దొరికే ఛాన్స్ లేదని అనుకున్నాం… నిహారిక సంచలన వ్యాఖ్యలు!
Advertisement
ఉప్పు ఎక్కువగా తినడం అనేది గుండె, ఇతర ప్రసరణ వ్యవస్థలకు ఒక ముఖ్యమైన ప్రమాదకారకం. ఉప్పులోనూ సోడియం మిళితం అయి ఉంటుంది. అలాంటి సోడియం నిల్వలను పారాసిటామాల్ టాబ్లెట్స్ పెంచుతున్నాయట. ప్రతి పారాసిటమాల్ టాబ్లెట్ లో సోడియం గణనీయమైన మొత్తంలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Advertisement
READ ALSO : ఈ 3 లక్షణాలు మీలో ఉన్నాయా… అయితే గుండెపోటు వచ్చే ప్రమాదం పక్కా!
ఇలాంటి టాబ్లెట్స్ విచ్చల విడిగా వాడడం వల్ల సోడియం నిలువలు పెరిగి హార్ట్ ఎటాక్స్, కార్డియాక్ అరెస్టులకు కారణం అవుతుంది హెచ్చరిస్తోంది. యూరోపియన్ హార్ట్ జర్నల్ తో పాటు చైనాలోని సెంట్రల్ సౌత్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఎక్కువ కాలం పాటు సోడియం కలిగిన పారాసిటమాల్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ లేదా గుండె ఆగిపోయే ప్రమాదం పెరుగుతుందని కనుగొన్నారు పరిశోధకులు.
READ ALSO : NOKIA : లోగో మార్చిన నోకియా… ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం