Home » పానీపూరి నీళ్లు తాగ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారా..?

పానీపూరి నీళ్లు తాగ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారా..?

by Anji
Ad

చాలా మంది పానీపూరీని ఇష్ట‌ప‌డుతుంటారు. మంచి మ‌సాలాలు, కారంతో కూడి ఘాటుగా ఉండ‌టంతో పానిపూని తినేందుకు ఎక్కువ మంది ఇష్ట‌ప‌డుతూ ఉంటారు. పిల్ల‌లు కూడా ఎంతో ఇష్ట‌ప‌డుతుంటారు. దేశంలో ఎక్కువ‌గా పానీపూరీ స్టాల్స్ ఉంటాయి. కొంద‌రూ పానీపూరి అనారోగ్య‌క‌ర‌మైనద‌ని చెబుతున్నా ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు మ‌రికొంద‌రు నిపుణులు. పానిపూరీ తిన‌డం విల్ల బ‌రువు త‌గ్గ‌డంతో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయంటున్నారు. పానీపూరిలో ఉప‌యోగించే నీరు చాలా వేడిగా కారంగా రుచిగా ఉంటుంది.

Also Read :  Vaseline కార‌ణంగా హీరోయిన్ అయిన ఈమె గురించి మీకు తెలుసా?

Advertisement

ఆక‌లి కాకుండా ఉండేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే అల‌స‌ట నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు బ‌రువు త‌గ్గ‌డానికి ఇంట్లో త‌యారు చేసిన పానీపూరి తీసుకుంటే మంచిది అని డైటీషియ‌న్లు స‌ల‌హా ఇస్తున్నారు. మీరు పానీపూరితో జీల‌క‌ర్ర, పుదీనా నీటిని కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇంట్లో త‌యారు చేసిన పానీపూరీ జీర్ణ‌క్రియ‌ను మెరుగు ప‌రుస్తుంద‌ట‌. పుదీనా, జీల‌క‌ర్ర‌ను నీటిలో క‌లుపుకోవ‌డం వ‌ల్ల క‌డుపు ఉబ్బ‌రం త‌గ్గుంది.

Advertisement

జీల‌క‌ర్ర‌, పుదీనా అనుసంధానం చేసిన పానీపూరిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో ప్ర‌యోజ‌నముంటుంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. పానీపూరి నీరుతో జీల‌క‌ర్ర, పుదీనా, చింత‌పండు ర‌సం క‌లిగి ఉంటుంది. మార్కెట్‌లో ల‌భించే రెడీ టూ మిక్స్ పానీ పూరీ మ‌సాలాలో రాక్‌సాల్ట్ ఎండి మామిడి, జీల‌క‌ర్ర‌, కారం, బ్లాక్ సాల్ట్‌, పుదీనా, న‌ల్ల మిరియాలు, ఎండు అల్లం, చింత‌పండు ర‌సం, సిట్రిక్ యాసిడ్‌లుంటాయి. పానీపూరి నీటికి రుచిని జోడించేందుకు ఉప్పును పెద్ద మొత్తంలో ఉప‌యోగిస్తారు. పుదీనా నీరు బ‌రువు త‌గ్గేందుకు అద్భుతంగా ప‌ని చేస్తుందంటారు. పుదీనా నీరు తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి మంచిది. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. పుదీనాలో శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఫైబ‌ర్‌, విట‌మిన్ ఏ, ఐర‌న్‌, మాంగ‌నీస్‌, ఫోలేట్ ఉంటాయ‌యి. జీల‌క‌ర్ర కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది.

చిన్న గ్లాస్‌లో నాన‌బెట్టిన జీల‌క‌ర్ర నీరు క‌డుపు సంబంధిత వ్యాధుల‌ను న‌యం చేస్తోంద‌ని నిపుణులు చెబుతున్నారు. బ‌రువు త‌గ్గ‌డానికి పానీ పూరీ పానీని తీసుకుంటే ఎంతో ఉప‌యోగం అని ఓ పోష‌కాహార నిపుణులు తెలిపాడు. పానీ పూరిలో ర‌వ్వ మైదాతో త‌యారు చేసింది. శ‌రీరానికి మంచిది కాదంటున్నారు. అయితే పానీపూరిని త‌యారు చేసేవారు శుభ్ర‌త పాటించ‌క‌పోవ‌డం వ‌ల్ల కొన్ని స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌య‌ని పేర్కొంటున్నారు.

Also Read :  ఐపీఎల్ మెగా వేలంలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన‌ కావ్య‌మార‌న్ గురించి తెలుసా..?

Visitors Are Also Reading