Home » సినిమాల్లోకి పల్లవి ప్రశాంత్‌.. హీరోగా ఎంట్రీ..?

సినిమాల్లోకి పల్లవి ప్రశాంత్‌.. హీరోగా ఎంట్రీ..?

by Anji
Published: Last Updated on
Ad

బిగ్‌ బాస్‌ తెలుగు 7 సీజన్‌తో రెండు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పాపులర్‌ అయిపోయాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. ఓ కామన్‌ మ్యాన్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అతను ఏకంగా టైటిల్‌ను ఎగరేసుకుపోయి స్టార్ సెలబ్రిటీగా మారిపోయాడు. శివాజీ, అమర్‌ దీప్‌ లాంటి సెలబ్రిటీలను అధిగమించి మరీ బిగ్‌ బాస్‌ టైటిల్‌ విజేతగా నిలిచాడు పల్లవి ప్రశాంత్‌. అయితే కొందరి అభిమానుల అత్యుత్సాహం రైతు బిడ్డను జైలు పాలు చేసింది. గ్రాండ్‌ ఫినాలే అనంతరం అన్న పూర్ణ స్టూడియో ఎదుట జరిగిన అల్లర్ల కేసులో రైతు బిడ్డను అరెస్ట్ చేశారు పోలీసులు. రిమాండ్ నిమిత్తం చంచల్‌ గూడ జైలులో ఉంచారు. అయితే కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో బయటకు వచ్చాడు.

Advertisement

ఇదిలా ఉంటే బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే ముగిసి పది రోజులైనా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తున్నాడు పల్లవి ప్రశాంత్‌. తన పరువు తీసేలా దుష్పచారం చేసిన కొందరు యూట్యూబర్లు, యాంకర్లపై ప్రశాంత్ కేసులు వేయనున్నాడని తెలుస్తోంది. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ రైతు బిడ్డకు సంబంధించిన ఒక విషయం అతని అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. అదేంటంటే..? బిగ్‌ బాస్‌ టైటిల్‌ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రైతు బిడ్డ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడట. కొందరు నిర్మాతలు పల్లవి ప్రశాంత్‌ను హీరోగా సినిమాలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారట.

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఉన్నప్పుడు, అలాగే బయట పల్లవి ప్రశాంత్‌ కు అండగా నిలిచిన పల్లవి ప్రశాంత్‌ పాట బిడ్డ భోలే షావలి స్వయంగా ఈ విషయాన్ని బయట పెట్టాడు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాట బిడ్డ..’ బిగ్‌ బాస్‌ హౌజ్‌ లో ఉన్నప్పుడే పల్లవి ప్రశాంత్‌ కు సినిమా ఆఫర్లు వచ్చాయి. గ్రాండ్‌ ఫినాలే అనంతరం ఇదే విషయం చెప్పాలి అనుకున్నాను. అయితే అనూహ్యంగా అతను అరెస్ట్ అయి జైలుకు వైళ్లాడు. పల్లవి ప్రశాంత్‌ హీరోగా నేనే మ్యూజిక్ డైరెక్టర్ గా సినిమా చేయమని అడుగుతున్నారు. అయితే అది పల్లవి ప్రశాంత్ ఇష్టం మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భోలే కామెంట్స్‌  సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏం జరుగుతుందో వేచి చూడాలి మరీ.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading