రైతు బిడ్డగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన పల్లవి ప్రశాంత్ తన కోరిక మేరకు ఎంతో కష్టపడి, ఎన్నో వీడియోలలో చెప్పుకొని బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. పల్లెటూరి పలకరింపుతో, అమాయకమైన నవ్వుతో ఎంట్రీ ఇచ్చి నాగార్జునని కూడా ఫిదా చేశాడు. ఇక ఇతను వచ్చిన మొదట్లోనే రతికతో ప్రేమాయణాన్ని మొదలుపెట్టి అందరూ తనని విమర్శించేలా చేసుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రతికపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
తన కొడుకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడంతో ప్రశాంత్ తల్లిదండ్రులు తన కొడుకుకి ఓటు వేయమని అందరినీ అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి వారి కొడుకు ఎంత కష్టపడి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాడో తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రతిక కేవలం ఓట్ల కోసమే తన కొడుకుతో అలా నటిస్తోందని కామెంట్స్ చేశారు. తన కొడుకుతో అలా ఉండడం వల్ల ప్రశాంత్ ఓట్లు కూడా తనకు పడతాయని తాను ప్లాన్ వేసుకుందని అలా తన కొడుకుని వాడుకుందని వారు ఆరోపించారు.
Advertisement
Advertisement
తన కొడుకు ఎవరితో అలా ప్రేమాయణం నడిపించడని, ప్రశాంత్ చాలా మంచి వ్యక్తి అని, ప్రతి ఒక్కరిని అక్క, చెల్లెలుగా పలకరిస్తాడని చెప్పుకొచ్చారు. తనకు ఆడవారిపట్ల ఎలాంటి దురాలోచన ఉండదని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా గతంలోనే తన కొడుకుకు వేరే అమ్మాయితో వివాహం చేయాలని అనుకున్నామని కానీ ముందు సెటిల్ అయ్యాక వివాహం చేద్దామని అనుకున్నామని చెప్పారు. బిగ్బాస్ హౌస్ నుంచి తన కొడుకు బయటకు వచ్చాక ప్రశాంత్ కి తప్పకుండా వివాహం చేస్తామని ప్రశాంత్ తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇవి కూడా చదవండి
- Pushpa 2 : అల్లు అర్జున్.. పింక్ గోరు వెనక గల మిస్టరీ ఏంటి…?
- Babar Azam : పాక్ డ్రెస్సింగ్ రూంలో పెద్ద గొడవ.. పచ్చి బూతులు తిట్టిన బాబర్ ?
- బైక్ మీద లిఫ్ట్ ఇచ్చిన ధోని….బండ బూతులు తిడుతున్న నెటిజన్లు…!