ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత మహేంద్రసింగ్ ధోని మీడియాకు దూరంగా గడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి దిగుతున్న ఫోటోలు మాత్రం బయటకు వస్తున్నాయి. రీసెంట్గా అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తో కలిసి గోల్ఫ్ ఆడుతూ సరదాగా అల్కరాజ్ మ్యాచ్ చూస్తున్న ధోని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Advertisement
MS Dhoni Lift an young cricketer on his bike
అలా ఇప్పుడు ధోని ఓ యంగ్ క్రికెటర్ కు లిఫ్ట్ ఇచ్చిన వీడియో కూడా హల్చల్ చేస్తుంది. రాంచికి చెందిన ఆ యంగ్ క్రికెటర్ గతంలో ధోనిని గ్రౌండ్స్ లో చాలా దూరం నుంచి చూసేవాడట. అలాంటి ఆ యంగ్ క్రికెటర్ కు మ్యాచ్ తర్వాత ధోని తన బైక్ పై లిఫ్ట్ ఇచ్చి ఇంటి దగ్గర దిగబెట్టాడు. ఈ క్రమంలో ఆ యంగ్ క్రికెటర్ ధోని బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు వెనకాల కూర్చొని తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే నెటిజెన్ల నుంచి వస్తున్న స్పందన వేరే రకంగా ఉంది.
Ad
Advertisement
MS Dhoni gave a lift to a young cricketer
ధోని నడుపుతున్న బండి యమహా RD 350 కాగా దాని నుంచి పొగా విపరీతంగా వస్తుంది. అంత పాత బండిని నడుపుతూ ధోని పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాడంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. పైగా ధోనీకి హెల్మెట్ ఉంది. కానీ వెనకాల కూర్చున్న యంగ్ క్రికెట్ ప్లేయర్ కు హెల్మెట్ లేదని…రన్నింగ్ లో ఉన్న బండిపై వీడియోలు తీసుకోవడం, సెల్ఫోన్ యూస్ చేయడం ఏంటి అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి
- నెక్స్ట్ లెవెల్ వెడ్డింగ్ కార్డు ! పవన్ క్రజ్ అంటే ఇదే కదా !
- Kodali Nani : నందమూరి వారి పెళ్ళిలో కొడాలి నాని.. పిక్ వైరల్!
- Prithvi Shaw : పాపం పృధ్వీ షాను.. శని దేవుడు అస్సడు వదలడం లేదుగా !