Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » Pushpa 2 : అల్లు అర్జున్.. పింక్ గోరు వెనక గల మిస్టరీ ఏంటి…?

Pushpa 2 : అల్లు అర్జున్.. పింక్ గోరు వెనక గల మిస్టరీ ఏంటి…?

by Bunty
Ads

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. పుష్ప సినిమా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టింది. పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప-2 మన ముందుకు రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరికొత్తగా చూపించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

 Here is the reason behind Allu Arjun's pinky nail finger

Here is the reason behind Allu Arjun’s pinky nail finger

సుకుమార్ కూడా పుష్ప-2 విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక పుష్ప-2 సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చేస్తామని చిత్రబృందం అనౌన్స్ చేసింది. అంతేకాకుండా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ఓ పోస్టర్ ని కూడా విడుదల చేసింది చిత్రబృందం. ఆ పోస్టర్లో అల్లు అర్జున్ చిటికెన వేలి గోరుని హైలెట్ చేస్తూ చూపించారు. ఈ మధ్య రిలీజ్ అయిన వేర్ ఇస్ పుష్ప అనే స్పెషల్ వీడియోలో కూడాబన్నీ గోరును హైలెట్ చేస్తూ చూపించారు. దీనిని అప్పట్లో ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈ గోరుపై పెద్ద చర్చ మొదలయ్యింది. అల్లు అర్జున్ చిటికెన వేలు గోరు వెనుక ఓ పెద్ద కథ దాగి ఉందట.

Ad

Advertisement

పురాతన కాలంలో కొన్ని సాంస్కృతుల్లో, సమాజంలో తమ స్థాయిని చూపించుకోవడానికి చిటికెన వేలు గోరుని పెంచుకునే వారట. తాము సంపన్నులమని చెప్పుకోవడానికి కూడా ఇలా చేసేవారట. అంతేకాకుండా రాజ్యాన్ని పరిపాలించడానికి వారికే అర్హత ఉందని చెప్పడానికి చిటికెన వేలు గోరుని పెంచుకుంటారట. ఎర్రచందనం వ్యాపారాన్ని అల్లు అర్జున్ చిటికెన వేలుపై నిలబెట్టి నడుపుతున్నాడని సూచనగా సుకుమార్ అల్లు అర్జున్ వేలి గోరుని హైలెట్ చేశారని చెప్పవచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియరాలేదు. సుకుమార్ చెప్పేవరకు దీనిపై క్లారిటీ రాదు. చిటికెన వేలు గోరుని పెంచడం వెనక కారణం ఏంటనేది సుకుమార్ చెప్పే వరకు వేచి ఉండాల్సిందే.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading