Home » ఇండియాను ఓడిస్తే పెళ్లి చేసుకుంటా అంటున్న పాక్ నటి..!

ఇండియాను ఓడిస్తే పెళ్లి చేసుకుంటా అంటున్న పాక్ నటి..!

by Azhar
Ad

ఇండియా, పాకిస్థాన్ మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి అనేది అందరికి తెలిసిందే. ఈ రెండు జట్లు ఎప్పుడు మ్యాచ్ ఆడుతాయ అని ఇండియా, పాక్ క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తారు. ఇక ఆ రెండు జట్లు కలిసి ఆడకపోయినా ఇండియా ఓడిపోవాలని పాక్.. పాక్ ఓడిపోవాలని ఇండియా ఫ్యాన్స్ కోరుకుంటారు. అదే ఆ జట్టు ఓడిపోతేనే మనకు మంచి జరుగుతుంది అంటే ఇంకా ఆ కోరిక… ప్రార్ధనలు మరో లెవల్ లో ఉంటాయి.

Advertisement

అయితే ప్రస్తుతం పాకిస్థాన్ లో ఇదే జరుగుతుంది. ఈరోజు సౌత్ ఆఫ్రికా పైన విజయం అందుకున్న పాకిస్థాన్ సెమీస్ వెళ్లాయి అంటే.. మన ఇండియా ఓటమి కూడా వారికీ కావాలి. అందుకే ఇండియా, జింబాబ్వే జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో మనం ఓడిపోవాలని పాక్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక అక్కడి ఓ నటి మరో అడుగు ముందుకు వేసింది.

Advertisement

ఇండియా ఓటమి పై పాకిస్థాన్ భవిష్యత్ ఆధారపడి ఉండటంతో.. తాను చేసిన ఓ ట్విట్ అనేది వైరల్ అవుతుంది. పాకిస్థాన్ నటి సెహర్ షిన్వారీ తన ట్విటర్ లో.. ఇండియాతో జరిగే మ్యాచ్ లో జింబాబ్వే జట్టు వారిని ఓడిస్తే.. నేను ఆ దేశానికి సంబంధించిన వ్యక్తినే పెళ్లి చేసుకంటా అని పేర్కొంది. అయితే ఈమె బంగ్లాతో ఇండియా మ్యాచ్ జరిగే సమయంలో ఇండియా ఓడిపోవాలి అని ట్విట్టర్లో పోస్టుల వర్షం కురిపించింది.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ కు సెమీస్ చేరే అవకాశాలు ఇలా… వర్షమే దిక్కు..!

ఇండియా జట్టులో ఇదే గొప్పతనం..!

Visitors Are Also Reading