ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉండే రైవలరి అనేది అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు దాయాధి పాకిస్థాన్ భవిష్యత్ అనేది మన ఇండియా చేతిలో ఉంది అనేది నిజం. ప్రస్తుతం ఆసియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో మన చేతిలో మొదట ఓడిన దాయాధి.. ఎవరు ఊహించని విధంగా జింబాబ్వే చేతిలో కూడా ఓడిపోయింది. అందువల్ల ఇప్పుడు ఆ జట్టు సెమీస్ చేరాలి అంటే ఇండియా పైనే ఆధారపడి ఉండి.
Advertisement
ఇప్పటికే రెండు మ్యాచ్ ల ఓడిన పాకిస్థాన్ సెమీస్ చేరాలి అంటే మిగితా మ్యాచ్ ల రిజల్ట్ అనేది ఈ విధంగా ఉండాలి. మొదట పాకిస్థాన్ కు మిగిలి ఉన్న మూడు మ్యాచ్ లలో గెలిస్తే ఆరు పాయింట్స్ వస్తాయి. ఇక ఇండియా కూడా మిగిలిన మూడు మ్యాచ్ లలో గెలిస్తే 10 పాయింట్స్ తో మొదటి స్థానంలో ఉంటుంది.
Advertisement
ఇక ఇప్పుడు 3 పాయింట్స్ తో సెమీస్ రేస్ లో ఉన్న సౌత్ ఆఫ్రికా ఇండియా, పాక్ చేతిలో ఓడిన తర్వాత మిగిలిన ఒక్క మ్యాచ్ గెలిచినా 5 పాయింట్స్ మాత్రమే అయితాయి. ఇక జింబాబ్వే జట్టు మన చేతిలో ఓడమే కాకుండా… బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ తో జరిగే మ్యాచ్ లో ఒక దానిలో ఓడిపోవాలి. అప్పుడు దానికి కూడా 5 పాయింట్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇండియా, పాక్ సెమీస్ చేరుకుంటాయి. కానీ ఇండియా ఒక్క మ్యాచ్ ఓడిన పాక్ కు గండం అనే చెప్పాలి.
ఇవి కూడా చదవండి :