Home » పాకిస్థాన్ నుండి వెళ్లే పాకిస్థాన్ ను ఓడించిన సికందర్ రజా..!

పాకిస్థాన్ నుండి వెళ్లే పాకిస్థాన్ ను ఓడించిన సికందర్ రజా..!

by Azhar
Ad

పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో పసికూన అని పేరు తెచుకున్న జింబాబ్వే విజయం సాధించి అందర్నీ ఆశ్చర్య పరిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి కేవలం 130 పరుగులే చేసిన జింబాబ్వే.. ఛేజింగ్ లో బాగా ఆడే పాకిస్థాన్ పైన విజయం సాధిస్తుంది అని ఎవరు అనుకోలేదు. కానీ అదే జరిగింది.

Advertisement

అయితే ఈ మ్యాచ్ లో జింబాబ్వే విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు ఆ జట్టు ఆల్ రౌండర్ సికిందర్ రాజా. పటిష్టమైన స్థితిలో ఉన్న పాక్ జట్టుకు వెంట వెంటనే వికెట్లు తీసి షాక్ అనేది ఇచ్చాడు. ఆ తర్వాత కూడా మరో వికెట్ తీసి జింబాబ్వే విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్ లో పాక్ ఓటమికి కారణం అయిన ఈ సికిందర్ రజా పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రాంతంలోనే పుట్టాడు.

Advertisement

పైలెట్ కావాలని అనుకున్న సికిందర్ రాజా.. ఆ దిశగానే చదివాడు. కానీ పాకిస్థాన్ లో జరిగిన మెడికల్ టెస్ట్ లో ఫిల్ అయ్యాడు. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ జింబాబ్వే వెళ్లి సెటిల్ అయ్యింది. ఇక ఎప్పటికి పైలెట్ కాలేను అని అర్ధం చేసుకున్న రజా.. క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. జింబాబ్వే జట్టు తరపున దేశవాళీల బాగా ఆడి.. జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇక్కడ కూడా బాగానే రాణిస్తున్నాడు రజా.

ఇవి కూడా చదవండి :

బాబర్ ఆజాం కొత్త జాబ్ అదేనా..?

అప్పుడే నా కెరియర్ ముగిసేది అంటున్న అశ్విన్..!

Visitors Are Also Reading