Ad
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అనేది చాలా ప్రసిద్ధి చెందిన ఆట అనేది అందరికి తెలిసిందే. ఇంకా ముఖ్యంగా దాయాదులు అయిన ఇండియా, పాకిస్థాన్ రెండు దేశాలలో కూడా ఈ ఆటనే ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతారు. అయితే క్రికెట్ లో ఎప్పుడు బ్యాటర్, బౌలర్ కంటే ఆల్ రౌండర్ చాలా ముఖ్యం అవుతాడు. జట్టు అనేది బ్యాలెన్స్ గా ఉండాలి అంటే జట్టులో ఎక్కువ మంది ఆల్ రౌండర్లు ఉండాలి.
క్రికెట్ లో మ్యాచ్ ఫలితాలను ఎక్కువగా ఈ ఆల్ రౌండర్ లే మలుస్తారు. అయితే మన ఇండియా జట్టులో స్పిన్ ఆల్ రౌండర్లుగా.. జడేజా, అశ్విన్, అక్షర్ ఉన్నారు. కానీ పేస్ ఆల్ రౌండర్ మాత్రం కేవలం హార్దిక్ పాండ్య మాత్రమే ఉన్నాడు. ఇక పాండ్య జట్టులో ఉంటేనే భారత జట్టు సమతుల్యంగా ఉంటుంది. మరి ఇలాంటి ఆల్ రౌండర్ మన దాయాధి అయిన పాకిస్థాన్ జట్టులో ఉన్నాడా అనేది పెద్ద ప్రశ్న.
అయితే ఈ ప్రశ్నకు పాకిస్థాన్ మాజీ కెప్టెన్.. స్టార్ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది సమాధానం ఇచ్చాడు. తాజాగా ఆఫ్రిది ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం పై మాట్లాడుతూ.. ఇండియా జట్టులో ఉన్న హార్దిక్ పాండ్య అద్భుతమైన ఆల్ రౌండర్. కానీ నేను తప్పకుండ చెప్పలేను అలాంటి ఆల్ రౌండర్ పాకిస్థాన్ జట్టులో ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు ఆల్ రౌండర్ స్థానాల్లో ఉన్న అందరూ ఒక్కటి రెండు మ్యాచ్ లు మినహా పూర్తిగా రాణించలేకపోతున్నారు అని ఆఫ్రిది చెప్పాడు.
ఇవి కూడా చదవండి :
రోహిత్, కార్తీక్ లతో ప్రచారం చేస్తున్న మన పోలీసులు..!
బాబర్ ను పడేసిన సూర్య కుమార్..!
Advertisement