Home » Viral Video : నువ్వా.. నేనా..? వార్న‌ర్ Vs షాహీన్ అప్రిదీ

Viral Video : నువ్వా.. నేనా..? వార్న‌ర్ Vs షాహీన్ అప్రిదీ

by Anji
Ad

పాకిస్తాన్‌, ఆస్ల్రేలియా మ‌ధ్య మూడ‌వ టెస్ట్‌లో మూడ‌వ రోజు ఆట‌లో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా రెండ‌వ ఇన్నింగ్స్ స‌మ‌యంలో వార్న‌ర్‌, పాక్ బౌల‌ర్ షాహీన్ అఫ్రిదీ నువ్వా.. నేనా అన్న‌ట్టుగా ఒక‌రిపై మ‌రొక‌రూ క‌త్తులు దూసుకున్నారు. అదేమిటి ఇద్ద‌రూ గొడ‌వ ప‌డ్డారా అనే సందేహం వ‌ద్దు. అస‌లు ఏమి జ‌రిగిందంటే.. అఫ్రిదీ వేసిన ఒక ఓవ‌ర్ చివ‌రి బంతిని వార్న‌ర్ డిఫెన్స్ ఆడాడు. నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న ఖ‌వాజా ప‌రుగు తీయ‌డానికి ముందుకు రాగా వార్న‌ర్ నో ర‌న్ అంటూ గ‌ట్టిగా అరిచాడు.

Also Read :  జైలులోనే వికీలీక్స్ ఫౌండర్ అసాంజే, స్టెల్లా మోరిస్‌ పెళ్లి

Advertisement

వార్న‌ర్ డిఫెన్స్ ఆడిన బంతిని అందుకునేందుకు వ‌చ్చిన అఫిదీ అటువైపు వెళ్ల‌కుండా వార్న‌ర్ మీద‌కు దూసుకొచ్చాడు. అత‌న్ని కొట్టేందుకు వెళ్లుతున్నాడా..? అన్న‌ట్టుగా దూసుకెళ్లాడు. తాను ఏమైనా త‌క్కువ తిన్న‌వా అన్న‌ట్టుగా వార్న‌ర్ కూడా అఫ్రిదికి ఎదురు వెళ్లాడు. ఇద్ద‌రు క్లోజ్‌గా వ‌చ్చి ఒక‌రి కళ్లలో ఒక‌రు సీరియ‌స్‌గా చూసుకున్నారు. ఆ త‌రువాత ఇద్ద‌రి మొహాల్లో న‌వ్వులు విర‌బూశాయి. ఇది చూసిన మిగ‌తా క్రికెట‌ర్లు కూడా వీరి చ‌ర్య‌కు న‌వ్వుకున్నారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Advertisement


మూడ‌వ రోజు ఆట ముగిసే స‌మ‌యానికి రెండ‌వ ఇన్నింగ్స్‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా ఆస్ట్రేలియా జ‌ట్టు 11 ప‌రుగులు చేసింది. వార్న‌ర్ 04, ఖ‌వాజా 07 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా జ‌ట్టు 134 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. అంత‌కు ముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 268 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. కేవ‌లం 20 ప‌రుగుల వ్య‌వ‌ధిలో పాకిస్తాన్ చివ‌రి ఆరు వికెట్లు కోల్పోవ‌డంతో ఆసీస్ జ‌ట్టుకు 123 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది. రావ‌ల్పిండి, క‌రాచీలో కాకుండా లాహోర్ పిచ్ కాస్త బౌల‌ర్ల‌కు కూడా స‌హ‌క‌రిస్తుండ‌డంతో ఈ టెస్ట్‌లో ఫ‌లితం తేలే అవ‌కాశ‌ముంది. నాలుగో రోజు ఆట అత్యంత కీల‌కం. ఆసీస్ ఎన్ని ప‌రుగులు చేసి పాక్‌కు ల‌క్ష్యాన్ని నిర్దేశించనుంద‌నే దానిమీద ఆ జ‌ట్టు విజ‌య‌వ‌కాశాలు ముడిప‌డి ఉన్నాయి.

Also Read :  నాకు డబ్బులు ఇవ్వలేదు… ప్రీతమ్ పై సమంత కామెంట్స్….!

Visitors Are Also Reading