Home » రూ.49తో రాత్రికి రాత్రి కోటీశ్వరుడు.. ఎలాగో తెలుసా ?

రూ.49తో రాత్రికి రాత్రి కోటీశ్వరుడు.. ఎలాగో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా అదృష్టం ఎప్పుడు ఎవ్వరి తలుపు తడుతుందో చెప్పలేము. ఈ విషయం ఇప్పటివరకు చాలా సందర్భాల్లో రుజువు అయింది కూడా. ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. ఒక సాధారణ  వ్యక్తిని అదృష్టం అనేది లక్షాధికారిని చేసింది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

ఆన్ లైన్ లో డ్రీమ్ 11 అనే ఓ క్రికెట్ బెట్టింగ్ యాప్ లో చాలా మంది డబ్బులు గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంటారు. బీహార్ లోని నవాడా జిల్లాలోని పిప్రా గ్రామానికి చెందిన రాజురామ్ కి డ్రీమ్ 11 యాప్ లో జాక్ పాట్ తగిలింది. రూ.49తో అతను ఏకంగా రూ.1కోటి గెలుచుకున్నాడు. రాజురామ్ డీజే ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. గత ఏడాదిన్నరగా డ్రీమ్ 11లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న బీపీఎల్ టోర్నీకి సిడ్నీ థండర్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్ కి సంబంధించి రూ.49తో పందెం కాశాడు. తనకు నచ్చిన ఉత్తమ ఆటగాళ్లలో జట్టును ఎంపిక చేసుకున్నాడు. ఆ జట్టే అగ్రస్థానంలో నిలవడంతో రూ.కోటి గెలుచుకున్నాడు. అందులో పన్నులు రూ.30 లక్షలు పోగా మిగిలిన రూ.70లక్షలను అతని అకౌంట్ లో జమఅయ్యాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న రాజురామ్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement

Also Read :  Megastar Chrianjeevi: మెగాస్టార్ చిరంజీవి విలన్ గా నటించిన సినిమాల గురించి మీకు తెలుసా ? 

అదేవిధంగా తమ గ్రామంలోని పలువురికీ రాజురామ్ స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు జరుపుకున్నారు.  అప్పుడప్పుడు చిన్న మొత్తంలో గెలుస్తుండేవాడినని రాజు చెప్పుకొచ్చాడు. రాజు సొంత గ్రామంలో ఓ దుకాణం నడుపుతూ.. అప్పుడప్పుడు డీజే ఆపరేటర్ గా పని చేస్తుండేవాడు. ఇంతలోనే రాజురామ్ రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు. దాదాపు 35 లక్షల మంది ఒకేసారి ఆ గేమ్ ఆడేవారు అని చెప్పుకొచ్చాడు. గతంలో కూడా బీహార్ లోని ఆర్రాలో, ఆన్ లైన్ గేమింగ్ యాప్ డ్రీమ్ 11 నుంచి ఓ వ్యక్తి కోటి రూపాయలు గెలుచుకున్నాడు. అర్రా జిల్లా చార్పొఖారీ బ్లాక్ ఠాకూరి గ్రామానికి చెందిన వెంకటేష్ సింగ్ కుమారుడు సౌరభ్ కుమార్ డ్రీమ్ 11 విజేతగా నిలిచాడు. అదృష్టం ఉంటే ఎలాంటి వారు అయినా కోటిశ్వరులు కావచ్చనడానికి ఇదే సాక్షం అని చెప్పవచ్చు. 

 Also Read :  స్పీడ్ డ్రైవింగ్ విషయంలో పంత్ ను హెచ్చరించిన ధావన్.. ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది..!!

Visitors Are Also Reading