Home » Megastar Chrianjeevi: మెగాస్టార్ చిరంజీవి విలన్ గా నటించిన సినిమాల గురించి మీకు తెలుసా ? 

Megastar Chrianjeevi: మెగాస్టార్ చిరంజీవి విలన్ గా నటించిన సినిమాల గురించి మీకు తెలుసా ? 

by Anji
Ad

Megastar Chiranjeevi Movies: మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండానే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తన స్వశక్తితో కష్టపడి నటుడిగా ఎదిగాడు. అద్భుతమైన సినిమాల్లో నటించి మెగాస్టార్ గా సినీ అభిమానుల మనసులో నిలిచిపోయాడు.

Megastar Chiranjeevi Movies:

Megastar Chiranjeevi Movies:

చెన్నై ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో ఉండగానే సినిమా అవకాశాలను అందుకున్నాడు. పునాది రాళ్లు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇక ఆ సినిమాతోనే  తన సినీ కెరీర్ కి బలమైన పునాది రాళ్లు వేసుకున్నాడు. ప్రస్తుతం చిరంజీవి 154వ సినిమా అయినటువంటి వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తున్నాడు. 

Advertisement

వాస్తవానికి చిరంజీవి సినిమా అవకాశాలు కావాలని ఏ నిర్మాత, దర్శకుడి చుట్టూ అసలే తిరగలేదు. డిగ్రీలో బీకాం పూర్తి చేసిన చిరంజీవి భారతీరాజా ఇన్ స్టిట్యూట్ లో చేరాడు. నటనలో కావాల్సిన శిక్షణ తీసుకున్నాడు. మంచి ప్రతిభ కనబరచడంతో పునాది రాళ్లు సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చింది. ఇక ఆ సినిమాలో చిరంజీవి స్టిల్స్ చూసి ప్రముఖ నిర్మాత క్రాంతి కుమార్ ప్రాణం ఖరీదు సినిమాలో నటించేందుకు ఛాన్స్ ఇచ్చాడు. అప్పటి వరకు ఉన్న శివశంకరప్రసాద్ అనే పేరు కాస్త చిరంజీవిగా మారింది. 

Advertisement

Also Read :   కళ్యాణ్ రామ్ లో ఉన్న ఆ గొప్ప లక్షణం వల్లే డైరెక్టర్లు స్టార్స్ అయ్యారా..?

Megastar Chiranjeevi Movies:

తాను హీరోగా కొనసాగుతున్న రోజుల్లోనే విలన్ పాత్రలు పోషించే అవకాశం లభించింది. ఆ పాత్రలను చేయనంటే పెద్ద నిర్మాణ సంస్థలు ఏమనుకుంటాయో అని.. మళ్లీ అవకాశం వస్తుందో లేదో అనే భయంతో విలన్ పాత్రలకు నో చెప్పలేకపోయాడు. 1979లో కమల్ హాసన్ హీరోగా జయసుధ కథానాయకిగా చేసిన ఇది కథకాదు అనే సినిమాలో చిరంజీవి విలన్ గా కనిపించారు. అదేవిధంగా 1980లో శోభన్ బాబు, శ్రీదేవి జంటగా నటించిన మోసగాడు చిత్రంలో విలన్ పాత్ర పోషించాడు చిరంజీవి. 1981లో శరత్ కుమార్ హీరోగా, రాధిక హీరోయిన్ గా నటించిన న్యాయం కావాలి సినిమాలో నెగటివ్ రోల్ చేశాడు. ఆ తరువాత 47 డేస్, తిరుగులేని మనిషి, పున్నమి నాగు వంటి చిత్రాల్లో నెగటివ్ పాత్రలలో నటించాడు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. హీరో క్యారెక్టర్ అని చెప్పి రెండు సినిమాలలో కృష్ణతో కలిసి విలన్ పాత్రలలో నటించేలా చేశారు. అయినప్పటికీ తన కెరీర్ కోసం తప్పదని చేశాడు మెగాస్టార్ చిరంజీవి. 

Also Read :   ప్రభాస్ సొంత అన్న సినిమాల్లోకి ఎందుకు రాలేదు.. అసలు ఆయన ఏం చేస్తారు !

Visitors Are Also Reading