కుంభ రాశి వారికి వచ్చే మూడు నెలల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. కుంభరాశి వారికి ముందుగా మే నెలలో చూసినట్లయితే శని,కుజుల వలన కుంభ రాశి వారికి కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. మూడో వారంలో బాగా చికాకులు ఉంటాయి. ఇక ఆర్థిక వెసులుబాటు కూడా చికాకును కలిగిస్తుంది. ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలను సరి చేయగలుగుతారు. రుణ విషయంలో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. అయితే ఆరోగ్య పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.
Advertisement
దూరప్రయాణాలు చేయవద్దు. ఇక జూన్ నెలలో చూసినట్లయితే చెప్పదగిన ఇబ్బందులు అయితే ఉండవు. ప్రత్యేకమైన లాభాలు ఉంటాయి. ప్రతీ పనిని స్వయంగా చేసుకొని లబ్ధి పొందుతారు. ఇక ఆర్థిక వెసులుబాటు, రుణ సౌకర్యం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల సహకారంతో వీరి జీవితం అద్భుతంగా మారుతుంది. ఇక అన్ని విషయాల్లో కూడా చాలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఇక జూలై నెలలో చూసినట్లయితే..
Advertisement
కుంభరాశి వారు మంచి ప్రవర్తనతో శ్రద్ధగా కార్యచరణను ప్రారంభిస్తారు. అన్ని రంగాల్లో విజయావకాశాలు ఉంటాయి. అలాగే దీర్ఘకాలిక కార్యక్రమాల మీద దృష్టి సారించాలి. కుటుంబపరంగా బాగుంటుంది. ఈ నెలలో ఆర్థికపరంగా,రుణ విషయాల్లో కూడా బాగుంటుంది. ఈ నెలలో సమస్యల నుండి బయట పడాలి అంటే శని గ్రహ పరిహారం పాటించాలి. దీని వల్ల శుభ ఫలితాలు పొందుతారు.
ALSO READ;
F3Movie : ఎఫ్-3 ట్రైలర్ విడుదలకు సిద్ధం.. ముహూర్తం ఎప్పుడంటే..?
ప్రాంక్ లొల్లి..గెట్ అవుట్ అంటూ విశ్వక్ సేన్ పై దేవినాగవల్లి ఫైర్…వీడియో వైరల్…!