Home » F3Movie : ఎఫ్‌-3 ట్రైల‌ర్ విడుద‌ల‌కు సిద్ధం.. ముహూర్తం ఎప్పుడంటే..?

F3Movie : ఎఫ్‌-3 ట్రైల‌ర్ విడుద‌ల‌కు సిద్ధం.. ముహూర్తం ఎప్పుడంటే..?

by Anji
Ad

టాలీవుడ్ హీరోలు విక్ట‌రి వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ క‌లిసి న‌టించిన లెటెస్ట్‌ మూవీ ఎఫ్‌-3. 2019 సంక్రాంతికి విడుద‌లైన ఎఫ్‌-2 సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా వ‌స్తోంది. ఈ సినిమాకు కూడా ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడినే ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. త‌మ‌న్నా, మెహ‌రిన్ హీరోయిన్లుగా న‌టించారు. నిర్మాత‌గా దిల్‌రాజ్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Advertisement

అయితే ఎఫ్‌-2 చిత్రం భారీ విజ‌యం సాధించ‌డంతో ఎఫ్‌-3 మూవీని కూడా తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో కూడా క‌థానాయిక‌లుగా త‌మ‌న్నా, మెహ‌రీన్‌లు న‌టిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్త‌యి విడుద‌ల‌య్యేందుకు సిద్దంగా ఉంది.

ఈ త‌రుణంలోనే ఎఫ్‌-3 మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చింది. ఈ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల తేదీ ఖ‌రారు అయింది. మే 09న ఎఫ్‌-3 ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే చిత్ర బృందం ప్ర‌క‌టించింది. పుల్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా మే 27న విడుద‌ల‌వ్వ‌నుంది. ఎఫ్‌-2 మాదిరిగా ఎఫ్‌-3 కూడా విజ‌యం సాధిస్తుందో లేదో అనేది మే 27న తేల‌నుంది.

Also Read : 

“ఆ” అక్షరం తో మెగాస్టార్ సినిమా చేస్తే ఫ్లాపేనా…?

న‌డిరోడ్డుపై విశ్వ‌క్ సేన్ ర‌చ్చ‌.. కేసు న‌మోదు చేయాలంటున్న నెటిజ‌న్లు..!

Visitors Are Also Reading