Home » భారత్ కి సపోర్ట్ గా మాల్దీవుల ప్రతిపక్ష పార్టీలు…!

భారత్ కి సపోర్ట్ గా మాల్దీవుల ప్రతిపక్ష పార్టీలు…!

by Sravya
Ad

భారత ప్రధాని నరేంద్ర మోడీ పై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద కామెంట్లతో ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ మయూజు చైనా పర్యటన తర్వాత సైనికులను ఉపసంహరించుకోవాలని ఇండియాని కోరారు దేశవ్యాప్తంగా కూడా ఆయన మీద వివిధ విమర్శల పర్వం స్టార్ట్ అయింది. మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ డెమోక్రాట్లు సంయుక్తంగా ఒక పత్రిక ప్రకటనని విడుదల చేశారు. దేశ విదేశాంగ విధానంలో వచ్చిన మార్పు మాల్దీవులకి అత్యంత హానికరం అని అన్నారు.

Advertisement

Advertisement

మా మిత్ర దేశం భారత్ ని వేరు చేయడం వలన మాల్దీవులు దీర్ఘకాలిక అభివృద్ధికి తీవ్ర నష్టం కలిగిందని అన్నారు. మాల్దీయుల స్థిరత్వం తో పాటుగా భద్రత, హిందూ మహాసముద్రం భద్రత ముఖ్యమైనది అని అన్నారు. ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు తీవ్ర ఆందోళనకి గురి చేస్తుందని అన్నారు. చైనా గూడచారి నొక మాల్దీవులు వైపు వెళుతుందని ఇటీవల రాయిటర్స్ నివేదిక చెప్పింది. మాల్దీవులు అధ్యక్షుడు ఈ నౌక ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఫిబ్రవరి మొదటి వారంలో చైనీస్ గూడచారి నౌక మాలికి చేరుకుందని వచ్చిన వార్తపై విదేశాంగ మంత్రుత్వ శాఖ స్పందిస్తూ ఈ ద్వీపదేశం ఎప్పుడు స్నేహపూర్వకల దేశాల నౌకలికి స్వాగతిస్తుందని ప్రకటించారు. మాల్దీవులు ఈ చర్య మీద భారత తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading