తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కి ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. రజనీకాంత్ ఒక్క సినిమా తీస్తే అభిమానులకు పండుగనే. దాదాపు సినిమా ఎలా ఉందనేది పక్కకు పెడితే వారం రోజుల పాటు పండుగ వాతావరణం నెలకొంటుంది. రజనీ క్రేజ్ అలాంటిది మరీ. ముఖ్యంగా రజనీ నటించిన జైలర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు రూ.95 కోట్లు వసూలు చేసింది. అంటే రజనీకాంత్ కి ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో మార్కెట్ ఉందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రజనీకాంత్ జైలర్ మూవీ ఈజీగా రూ.500 కోట్ల కంటే ఎక్కువనే కలెక్షన్లను వసూలు చేసే అవకాశం ఉంది.
Advertisement
రోజు రోజుకు వయస్సు పెరుగుతున్నా కానీ రజనీకాంత్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గడం లేదు. ఎవ్వరికైనా వయస్సు పెరిగే కొద్ది క్రేజ్ కాస్త తగ్గుతుంటుంది. కానీ రజనీకాంత్ మాత్రం పెరుగుతుంది. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.430 కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇతర భాషల్లో కూడా క్రేజ్ సంపాదించుకున్న రజనీకాంత్ కి ఖరీదు అయిన విల్లాలతో పాటు లగ్జరీ కార్లు సైతం ఉన్నాయి. ఆధ్యాత్మికత ఎక్కువగా ఉన్న అతికొద్ది మంది హీరోల్లో రజనీకాంత్ ఒకరు కావడం గమనార్హం. రజనీకాంత్ జైలర్ మూవీ సక్సెస్ సాధించడంతో ఫామ్ లోకి రావడంతో భవిష్యత్ ప్రాజెక్ట్ లపై అంచనాలు పెరుగుతున్నాయి. సాధారణంగా ఒక్క సినిమాకి రూ.80 కోట్లు పారితోషికం తీసుకుంటున్న రజనీకాంత్ తన సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోతే రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
Advertisement
రజనీకాంత్-నెల్స్ దిలీప్ కుమార్ కాంబోలో మరిన్ని సినిమాలు వస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వయస్సుకి తగిన పాత్రలను ఎంచుకుంటున్న రజనీని సైతం నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కథలకు అనుగుణంగా లుక్స్ ని మార్చుకుంటున్న రజనీ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువనే అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాబోయే రోజుల్లో రజనీకాంత్ కి మరిన్నీ విజయాలు దక్కాలని అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. రజనీకాంత్ కొత్త సినిమా లాల్ సలామ్ పై కూడా అంచనాలు పెరుగుతుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్స్ ని సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి మరీ.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు
Prabhas: ప్రభాస్ కు సర్జరీ..? కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంటారా..? అసలేమైంది?
మహేష్ – నమ్రత ఇద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారో తెలుసా?