Home » మహేష్ – నమ్రత ఇద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారో తెలుసా?

మహేష్ – నమ్రత ఇద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారో తెలుసా?

by Bunty

 

 

టాలీవుడ్ లో మహేష్ బాబు – నమ్రతల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరిదీ చూడ చక్కనైన జంట. అంతే అండర్స్టాండింగ్ తో పెళ్లయినప్పటి నుంచి ఇప్పటివరకు అన్యోన్యంగా జీవితాన్ని గడుపుతున్నారు. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారు అనే విషయం గురించి మహేష్ బాబు ఫ్యాన్స్ సెర్చ్ చేస్తున్నారు. మహేష్ బాబు – నమ్రత… “వంశీ” సినిమా షూటింగ్ సమయంలో ఉన్నప్పుడు వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం న్యూజిలాండ్ లో జరిగింది. దాదాపు ఒక నెలపాటు అక్కడే షూటింగ్ చేశారు.

ఆ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం చాలా క్లోజ్ గా మారింది. ఈ సినిమా షూటింగ్ అయిపోయిన అనంతరం న్యూజిలాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నమ్రతనే మొదటగా మహేష్ బాబుకి ప్రపోజ్ చేసింది. అప్పటికే మహేష్ బాబుకి నమ్రత అంటే చాలా ఇష్టం ఉంది కానీ మహేష్ బాబు చెప్పలేకపోయాడు. కానీ వీరి ప్రేమను మహేష్ బాబు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. మహేష్ బాబు సిస్టర్ మంజుల వీరి ప్రేమకు చాలా సపోర్ట్ చేసిందట.

దాదాపు వీరిద్దరూ ఐదేళ్లు వారి ప్రేమాయణాన్ని కొనసాగించారు. ఆ తర్వాత వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించి వీరి వివాహాన్ని చాలా సింపుల్ గా చేశారు. ఇక వివాహ అనంతరం నమ్రత సినిమాలకు పూర్తిగా దూరమై తన కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తుంది. వివాహ అనంతరం మహేష్ బాబుకు సంబంధించిన ప్రతి వ్యవహారాలను నమ్రత దగ్గరుండి మరి చూసుకునేది. ఇక సినిమాలలో ఎప్పుడు బిజీగా ఉండే మహేష్ బాబు కాస్త సమయం తీసుకుని కుటుంబంతో కూడా సమయాన్ని గడుపుతున్నాడు.

ఇవి కూడా చదవండి : 

Ustaad Movie Review : `ఉస్తాద్‌` మూవీ రివ్యూ

Bholaa Shankar Review : భోళా శంకర్ రివ్యూ.. మెగాస్టార్‌ కు షాక్‌ తప్పదా ?

సినిమా నాశనం చేశారు.. చిరంజీవిపై శ్రీరెడ్డి సీరియస్‌ !

Visitors Are Also Reading