Home » NTR: నందమూరి ఫ్యామిలీ నుంచి మరో ఎన్టీయార్.. ఆ దర్శకుడుతో ఫస్ట్ మూవీ..!

NTR: నందమూరి ఫ్యామిలీ నుంచి మరో ఎన్టీయార్.. ఆ దర్శకుడుతో ఫస్ట్ మూవీ..!

by Sravya
Ad

NTR: సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా స్టార్ యాక్టర్ అద్భుతంగా రాణిస్తూ ఉంటే, తర్వాత వాళ్ళ కొడుకుల్ని లేదంటే అన్నదమ్ముల్ని కూడా ఇండస్ట్రీ లోకి తీసుకొస్తూ ఉంటారు. ఇలా చాలా మంది హీరోలు తన కుటుంబ సభ్యుల్ని హీరోలుగా మార్చారు. వై వి ఎస్ చౌదరి దేవదాసు వంటి సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడం వలన ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీలో లేరు. ఇక ఇప్పుడు మళ్లీ ఆయన ఒక సాలిడ్ హిట్ కొట్టాలని కాన్సెప్ట్ తో రీయంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. నందమూరి హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్ కొడుకుని హీరోగా పరిచయం చేసే బాధ్యత వైవిఎస్ చౌదరి స్వీకరించినట్లు టాక్.

 జానకిరామ్ కొడుకు పేరు కూడా ఎన్టీఆర్ అవ్వడం విశేషం మొత్తానికి ఇండస్ట్రీకి మూడవ ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలో వైవిఎస్ చౌదరి మరోసారి తన మార్కుతో మంచి విజయాన్ని సాధించే ప్రయత్నం చేస్తున్నారు అని తెలుస్తోంది. రేయ్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న ఆయన సినిమా ఇండస్ట్రీ నుండి ఫేడ్ అవుట్ అయిపోయారు. అప్పటినుండి ఇప్పటిదాకా సినిమాలో సినిమాలు చేయలేదు.

Advertisement

Advertisement

Also read:

దాదాపు 10 ఏళ్లు ఖాళీగా ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వైవిఎస్ చేతిలో ఈ ఎన్టీఆర్ సినిమా చేయడం కరెక్టేనా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వైఎస్ చౌదరికి నందమూరి ఫ్యామిలీ మీద ఎంతో ఇష్టం ఉంది ఆ ఇష్టంతో కచ్చితంగా ఒక మంచి సక్సెస్ ని ఇచ్చే అవకాశం ఉంది. హరికృష్ణతో లాహిరి లాహిరి లాహిరిలో అలానే సీతయ్య వంటి మూవీస్ చేసి సూపర్ సక్సెస్ లను ఇచ్చారు ఇలా నందమూరి ఫ్యామిలీ కి వైవిఎస్ చౌదరి దగ్గర అయ్యారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుండి మరో హీరో రాబోతున్నారు మరి ఎంతలా సక్సెస్ ని అందుకుంటారో చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading