ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. నిరుద్యోగులకు ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పబోతోంది. టీఎస్ఆర్టీసీ సేవలు ఇంకాస్త మెరుగుపరచడానికి కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఆర్టీసీలో ఇంకో 3000 కొత్త నియామకాలు కోసం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే దానికి సంబంధించి ఈ నెల 31న కీలక ప్రకటన చేయబోతున్నట్లు చెప్పారు. నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు కొత్తగా 3000 బస్సులు తీసుకురాబోతున్నట్లు స్పష్టం చేశారు.
Advertisement
Advertisement
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో రద్దీ బాగా పెరిగింది అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చుకోవాలని అనుకుంటున్నారు. తాజాగా 1325 డీజిల్, 1050 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే వాటికి అనుసంధానం చేస్తూ ఇంకో 3 వేల బస్సులను కొత్తగా కొనుగోలు చేయడానికి సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!