Home » కేవలం ఒకే ఒక టీవీ ఇంటర్వ్యూ ఎన్టీఆర్ జీవితాన్ని ఎలా చిన్నాభిన్నం చేసిందో తెలుసా ?

కేవలం ఒకే ఒక టీవీ ఇంటర్వ్యూ ఎన్టీఆర్ జీవితాన్ని ఎలా చిన్నాభిన్నం చేసిందో తెలుసా ?

by Bunty
Ad

అన్న‌గారు ఎన్టీరామారావు న‌టుడుగానే కాకుండా రాజ‌కీయాల్లోనూ చ‌క్రం తిప్పారు. ముఖ్యమంత్రిగా ఆయ‌న తెలుగు ప్ర‌జ‌ల‌కు చేసిన సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివి. ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా తెలుగు ప్ర‌జ‌ల‌కోసం న‌మ్మ‌కున్న కార్య‌క‌ర్త‌ల కోసం ధైర్యంగా అన్యాయాల‌ను ఎదిరించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన త‌ర‌వాత అద్భుత‌మైన ప‌థ‌కాల‌ను తీసుకువ‌చ్చారు.

read also : “మసూద”లో బుర్కా చాటున ప్రేక్షకులని భయపెట్టిన అమ్మాయి ఎవరో తెలుసా..?

Advertisement

అయితే, అంతటి ఎన్టీఆర్ జీవితాన్ని ఒక టీవీ ఇంటర్వ్యూ చిన్నాభిన్నం చేసింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ ని గద్దె దించడానికి చంద్రబాబు చెప్పిన ఏకైక కారణం లక్ష్మీపార్వతి. అయితే ఎన్టీఆర్ వర్ధంతి కారణంగా ఆ కరణ జన్ముడిని స్మరించుకుందాం అనే శీర్షికతో ఒక టీవీ ఛానల్ ఇప్పుడు హడావిడి చేయడం చూస్తుంటే, గతంలో అదే ఛానల్ ఆయనపై కక్షగట్టి చంద్రబాబుకి సపోర్ట్ ఇచ్చి ఎల్లో మీడియా అనే అస్త్రాన్ని వాడుకొని జనాల్లో అనిచ్చితి సృష్టించిందో గుర్తుకు వచ్చింది. ఎన్టీఆర్ ని గద్దె దించే ముందు ఆయనపై వ్యతిరేకంగా అనేక వార్తలను ప్రసారం చేసిన సదరు ఛానల్ కి అప్పట్లో సాయంత్రం ప్రైమ్ టైంలో వార్తలను అందించేది. వాటిని జనాలు కూడా బాగా చూసేవారు. ఆ టైంలో వార్తలు ఇప్పటిలాగా లైవ్ గా వచ్చేవి కాదు.

Advertisement

ఈ రోజు వార్తలు సింగపూర్ నుంచి మరుసటి రోజు ప్రసారం అయ్యేది. ఇక చంద్రబాబు ఎన్టీఆర్ ని దించడానికి ప్రధాన కారణం లక్ష్మీపార్వతి అని కారణం చెప్తే, దానికి ప్రతిగా లక్ష్మీ పార్వతీ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు, తనకు కేవలం ఎన్టీఆర్ మాత్రమే ముఖ్యమని ఒక ప్రకటన చేసింది. దాంతో చంద్రబాబు అండ్ కో కు, గట్టి షాక్ తగిలింది. కానీ ఆ వార్తను పక్కన పెట్టి అంతకుముందు రెండు రోజుల క్రితం లక్ష్మీపార్వతి.. నాకు ఎన్టీఆర్ ముఖ్యం, ఎమ్మెల్యేలు పూచిక పుల్లలతో సమానం అంటూ మాట్లాడిన మాటలను ప్రసారం చేయడమే కాకుండా ఆమె రాజకీయ విరమణ ప్రకటన మరో రెండు రోజుల తర్వాత టెలికాస్ట్ చేశారు. దాంతో లక్ష్మి పార్వతి పాడిన రాజకీయ విరమణ అస్త్రం పూర్తిగా నిర్వీర్యం అయింది. ఈ లోగా ఎన్టీఆర్ ఎమ్మెల్యేలను సయోధ్యకు పిలిస్తే మేమంతా పిల్లలం అనే ఎదురు దాడి జరిగింది. దాంతో జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగే పోయింది. ఇలా ఒక టీవీ ఇంటర్వ్యూ ఎన్టీఆర్ జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది.

ALSO READ : వాట్సాప్ యూజర్ల కోసం మరో ఫీచర్.. ఇక నుంచి  గూగుల్ డ్రైవ్ అవసరం లేదు..!

Visitors Are Also Reading