Home » “మసూద”లో బుర్కా చాటున ప్రేక్షకులని భయపెట్టిన అమ్మాయి ఎవరో తెలుసా..?

“మసూద”లో బుర్కా చాటున ప్రేక్షకులని భయపెట్టిన అమ్మాయి ఎవరో తెలుసా..?

by Bunty
Ad

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, మళ్లీ రావా, థ్రిల్లర్, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ వంటి విభిన్న కథలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో వచ్చిన చిత్రం ‘మసూద’.  సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవీ శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, సత్యం రాజేష్ తదితరులు కీలకపాత్రను పోషించిన ఈ సినిమాతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. నవంబర్ 18న మసూద ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని సంపాదించుకుంది.

Advertisement

అయితే ఈ సినిమాలో ఓ రోజు నదియ (సంగీత కూతురు పాత్ర) వింతగా ప్రవర్తిస్తుంది. అర్ధరాత్రి వేళ తనతో తానే మాట్లాడుకుంటుంది. అది చూసి భయపడిన నీలం గోపిని సహాయం అడుగుతుంది. ఆమె ప్రవర్తనను చూసి గోపి ఆమెకు దయ్యం పట్టింది అని గ్రహిస్తాడు. ఆమెను బాగు చేసేందుకు చేసే ప్రయత్నాలలో వారు మసూద అనే అమ్మాయి గురించి తెలుసుకుంటారు. అసలు ఎవరు ఆ మసూదా? అనేది ఈ సినిమా కథ.

Advertisement

ఈ సినిమాలో కీలకమైన మసూద పాత్రను బుర్ఖాలో చూపిస్తారు. అయితే ఈ మూవీ సాధించిన సక్సెస్ ని ప్రేక్షకులతో కలిసి సెలెబ్రేట్ చేసుకునేందుకు థాంక్యూ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాసూదని పరిచయం చేసింది మూవీ యూనిట్. మసూద పాత్ర చేసిన ఆమె పేరు అఖిలరామ్. ఈమె తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. అఖిల హిందీలో లిఫ్ట్ 8055 అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. సినిమాలో ఈమెని బుర్ఖ లో చూసిన ఫ్యాన్స్ నేరుగా చూసి తెగ ఆనంద పడిపోతున్నారు.

read also : సావిత్రి ఇంట్లో ఉన్న బీరువాల కొద్దీ బంగారం… కూతురు విజయచాముండేశ్వరి సంచలన వ్యాఖ్యలు

Visitors Are Also Reading