Home » వాట్సాప్ యూజర్ల కోసం మరో ఫీచర్.. ఇక నుంచి  గూగుల్ డ్రైవ్ అవసరం లేదు..!

వాట్సాప్ యూజర్ల కోసం మరో ఫీచర్.. ఇక నుంచి  గూగుల్ డ్రైవ్ అవసరం లేదు..!

by Anji
Ad

వాట్సాప్ యూజర్ల కోసం నిత్యం ఏదో ఒక కొత్త ఫీచర్ ని పరిచయం చేస్తూ ఆకట్టుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. యూజర్ల అవసరానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్న మెసేజింగ్ యాప్ దిగ్గజం తాజాగా మరో సరికొత్త ఫీచర్ ని తీసుకొచ్చే పనిలో పడింది. ఛాట్ ట్రాన్స్ ఫర్ పేరుతో నూతన ఫీచర్ ని తీసుకొస్తుంది. ఆండ్రాయిడ్ డివైజ్ నుంచి వచ్చిన డేటాను మరో లోకల్ నెట్ వర్క్ తో పని చేస్తున్న డివైజ్ కి ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్ లో ఉన్నది. టెస్టింగ్ విజయవంతంగా పూర్తి చేసిన తరువాత యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.


వాట్సాప్ బీటీ ఇన్ఫో వర్గాల ప్రకారం.. క్యూ ఆర్ కోడ్ స్కాన్ ద్వారా యూజర్లు తమ ఛాట్ హిస్టరిని ట్రాన్స్ ఫర్ చేయడానికి ఈ ఫీచర్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ వాట్సాప్ చాట్ బ్యాకప్ చేసుకోవడం కోసం ఇక నుంచి గూగుల్ డ్రైవ్ వాడాల్సిన అవసరమే లేకుండా చేస్తుంది. ముఖ్యంగా ఒక డివైజ్ నుంచి మరో డివైజ్ కి చాట్ ట్రాన్స్ ఫర్ చేయాలనుకుంటే వారు బ్యాకప్ కోసం క్లౌడ్ సర్వీస్ లకు వెళ్లాల్సిన అవసరం ఉండదని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది.

Advertisement

Advertisement

Also Read :  మాట్లాడినా ఏడ్చినా అది త‌ప్ప‌దు…వైర‌ల్ అవుతున్న స‌మంత పోస్ట్..!


ఇక ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు తమ డేటాని సులభంగా బ్యాకప్ పొందవచ్చు. వాట్సాప్ అంతకు ముందు ప్రాక్సీ సపోర్ట్ ఫీచర్ ని తీసుకొచ్చిన విషయం విధితమే. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ నిర్ణయంతో ఏ సమయంలో అయినా వాట్సాప్ కనెక్షన్ బ్లాక్ అయినట్టయితే.. దానిని పునరుద్ధరించుకునేందుకు యూజర్లకు అవకాశం కల్పించారు. పలు రకాల సర్వర్ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా కమ్యూనికేట్ చేసేందుకు ఈ ప్రాక్సీ అద్భుతంగా ఉపయోగపడుతుంది.

Also Read :  బల్లి అలా కనపడితే దేనికి సంకేతమో తెలుసా ?

Visitors Are Also Reading