Home » ఒకేరోజు టెట్, ఆర్ఆర్‌బీ ప‌రీక్ష.. మంత్రి స‌బితాఇంద్రారెడ్డి ఏమ‌న్నారంటే..?

ఒకేరోజు టెట్, ఆర్ఆర్‌బీ ప‌రీక్ష.. మంత్రి స‌బితాఇంద్రారెడ్డి ఏమ‌న్నారంటే..?

by Anji
Ad

తెలంగాణ ప్ర‌భుత్వం వ‌రుస‌గా నోటిఫికేష‌న్లు విడుదల చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే గ్రూపు-1, పోలీస్ రిక్రూట్ మెంట్ నోటిఫికేష‌న్లు విడుద‌ల కాగా.. త్వ‌ర‌లోనే గ్రూపు-2, గ్రూప్ 4 నోటిఫికేష‌న్లు ఇవ్వ‌డానికి స‌మాయ‌త్తం అవుతోంది. ఇక టెట్ ప‌రీక్ష నిర్వ‌హించేందుకు ఇప్ప‌టికే తేదీని కూడా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.


అయితే తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన టెట్ ప‌రీక్ష తేదీ మార్చాల‌ని ప‌లువురు అభ్య‌ర్థులు కోరుతున్నారు. తాజాగా ఓ అభ్య‌ర్థి వాయిదా వేయాల‌ని మీరే చొరువ తీసుకోవాలంటూ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేసారు. ఈ విష‌యాన్ని ప‌రిశీలించాల‌ని మంత్రి కేటీఆర్ మంత్రి స‌బితాఇంద్రారెడ్డిని కోరుతూ ట్వీట్‌ను ట్యాగ్ చేసారు. కేటీఆర్ ట్వీట్‌పై మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స్పందించారు.

Advertisement

Advertisement


అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న త‌రువాత‌నే టెట్ ప‌రీక్ష‌ల తేదీల‌ను నిర్ణ‌యించామ‌ని.. వాయిదా వేయడం అస‌లు కుద‌ర‌ద‌ని స్ప‌ష్టం చేస్తూ ట్వీట్ చేశారు. ట్వీట్ చేసే ముందు సంబందిత అధికారుల‌తో కూడా మాట్లాడాన‌ని.. టెట్ ప‌రీక్ష‌లో సుమారు మూడున్న‌ర ల‌క్ష‌ల మంది పాల్గొంటున్నార‌ని.. రాష్ట్రంలోని ఇత‌ర పోటీ ప‌రీక్ష‌లకు మూల్యాంక‌నానికి ఎలాంటి ఇబ్బందులు క‌లుగ‌కుండానే ప్ర‌ణాళిక రూపొందించిన‌ట్టు చెప్పారు. ఇలాంటి స‌మ‌యంలో టెట్ ప‌రీక్ష ర‌ద్దు చేయ‌డం కుద‌ర‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తీసుకున్న నిర్ణ‌యంతో రెండు ప‌రీక్ష‌ల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు ఏదో ఒక ప‌రీక్ష రాయ‌డానికి మాత్ర‌మే అవ‌కాశం ఉంది. దీంతో అభ్య‌ర్థులు అయోమ‌యంలో ప‌డ్డారు.

Visitors Are Also Reading