Home » ‘సార్’ మూవీని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో…!

‘సార్’ మూవీని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో…!

by Bunty
Ad

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నేరుగా తెలుగులో నటించిన చిత్రం సార్. తొలిప్రేమ, మజ్ను, రంగ్ దే లాంటి ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించిన వెంకి అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. భీమ్లా నాయక్ తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. మహాశివరాత్రి కానుకగా శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఇక తమిళంలో వాతి పేరుతో రిలీజ్ కాగా అక్కడ కూడా పాజిటివ్ టాక్ వచ్చింది.

Advertisement

ప్రస్తుతం మన విద్యా వ్యవస్థలో ఉన్న అక్రమ వ్యాపారాలను కళ్ళకు కట్టినట్లు చూపించారని సార్ సినిమాపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సినిమాకి తొలిసారిగా తమిళ్ లో దర్శకత్వం వహించాడు తెలుగు యువ దర్శకుడు వెంకి అట్లూరి. వెంకీ అట్లూరి ఇప్పటికే తెలుగులో చాలా ఏళ్లుగా ఒక సరైన హిట్టు కోసం కష్టపడుతున్నారు. నటుడిగా, డైలాగ్ రైటర్ గా, రైటర్ గా, దర్శకుడిగా దాదాపుగా పదహారేళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నాడు. వెంకి చాలా పెద్ద బ్యానర్సులో సినిమాలు తీయడం వల్ల కథలో వేలు పెడతారు.

Advertisement

కాబట్టి వెంకీ అట్లూరి కాస్త నిరాశ చెందాడో ఏమో తెలియదు కానీ ఎలాంటి ఒక బ్యాగ్రౌండ్ లేని హీరోతో సినిమా తీయాలని భావించారు. అందుకే ఒక మంచి కథ సిద్ధం చేసుకుని మొదట మన తెలుగు హీరో అయిన నాచురల్ స్టార్ నానితో సినిమా తీయాలని అనుకున్నారు. ఈ తరుణంలోనే సార్ కథను నానికి చెప్పాడట. కానీ వెంకీ చెప్పిన కథలో మార్పులు చేయాలని నాని కోరాడట. దానికి వెంకీ అట్లురి ఓప్పుకోలేదట. దీంతో ధనుష్ తో చేశాడు సార్ సినిమా.

READ ALSO : పునీత్ నుండి తారకరత్న వరకు… ఈ మధ్యకాలంలో గుండెపోటుతో మరణించిన సెలబ్రిటీలు వీరే!

Visitors Are Also Reading