Home » మరోసారి పరువు పోగొట్టుకున్న పాక్ క్రికెటర్.. ఈసారి ఏం జరిగిందంటే..?

మరోసారి పరువు పోగొట్టుకున్న పాక్ క్రికెటర్.. ఈసారి ఏం జరిగిందంటే..?

by Anji
Ad

సాధారణంగా ఏ ఆటలో అయినా నిబంధనలను ఉల్లంఘించిన  ప్లేయర్లకు  మ్యాచ్ ఫీజ్ లో కోత లేదా  మ్యాచ్  ఆడకుండా నిషేదం విధించడం వంటిది జరుగుతుంది. అందుకే ఆటల్లో నిబంధనలు, నియమాల పట్ల ఆటగాళ్లకు తగిన అవగాహన తప్పకుండా ఉండాలి. చాలామంది ఆటగాళ్లు తెలియకుండానే నిబంధనలను  ఉల్లంఘిస్తుంటారు. కొందరు భావోద్వేగాలు కంట్రోల్ చేసుకోలేక నియమాలను కాలరాస్తుంటారు. తాజాగా పాకిస్తాన్ కు చెందిన క్రికెటర్ నిబంధనలు ఉల్లంఘించిన తీరు మాత్రం చాలా వెరైటీగా ఉందనే చెప్పవచ్చు. 

Advertisement

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా  క్రికెట్ లో ఎన్నో లీగ్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ లీగ్ లో భాగంగా తాజాగా క్రెటా గ్లాడియేటర్స్ వర్సెస్ ముల్తాన్ సుల్తాన్ జట్ల మధ్య ఓ మ్యాచ్ జరిగింది. ఈ లీగ్ లో గ్లాడియేటర్ జట్టుకు ప్రాధాన్యం వహిస్తున్నాడు పాక్ యంగ్ బౌలర్ నసీమ్ షా. గత కొద్ది రోజులుగా ట్రోలింగ్ కి గురవుతున్నాడు యంగ్ క్రికెటర్. ఈ మ్యాచ్ లో కూడా నిబంధనలను ఉల్లంఘించి మరోసారి తన పరువు పోగొట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ కి వచ్చిన నసీమ్ షా ధరించిన హెల్మెట్ అతన్ని చిక్కుల్లో పడేసింది. పాకిస్తాన్ లీగ్ ఆడుతున్న నసీమ్ షా హెల్మెట్ మాత్రం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ది ధరించాడు.

Advertisement

Also Read :  BRS లోకి అంబటి రాయుడు?

Asia Cup 2022: Naseem Shah, life in fast forward | Cricket News - Times of  India

దీంతో పాక్ క్రికెట్ బోర్డు నిబంధనలు ఉల్లంఘించినట్టయింది. అందుకే అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. ఇక నసీమ్ షా బంగ్లా ప్రీమియర్ లీగ్ లో కోమిల విక్టోరియా బ్రాంచెస్ కి ప్రాతినిధ్యం వహించాడు. అదే బ్యాగును తన వెంట తెచ్చుకొని పాక్ బౌలర్ బిపిఎల్ హెల్మెట్ ని ధరించి దారిలోకి దిగాడు. ప్రస్తుతం నశింషా బిపిఎల్ హెల్మెట్ ధరించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో క్రికెట్ అభిమానులు నేటిజన్లో పాక్ ఆటగాని ఓ ఆట ఆడుకుంటున్నారు. ఈ మాత్రం నిబంధనలు కూడా తెలియదా అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. 

Also Read :  IPL 2023 : ఐపీఎల్ 2023 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే..?

Visitors Are Also Reading