Home » BRS లోకి అంబటి రాయుడు?

BRS లోకి అంబటి రాయుడు?

by Bunty
Ad

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చారు. స్థానిక తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఆయన అధ్యక్షుడిగా, నాయకుడిగా కొనసాగుతున్నారు. సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యే అయ్యారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసిఆర్ గారికే దక్కింది.

Advertisement

ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశం అంతా తెలంగాణ మోడల్ పాలన అందిస్తామంటూ, తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి దేశ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు కెసిఆర్. ఇప్పటికే అధికారికంగా టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ గా మారింది. ఇక ఇవాళ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ మూడో సీజన్ ని సిద్దిపేటలో స్టార్ట్ చేశారు. గురువారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి హీరో నానితో పాటు అంబటి రాయుడు కూడా హాజరై తాను కేసీఆర్ కు పెద్ద ఫ్యాన్ అని ప్రకటించాడు.

Advertisement

దీంతో రాయుడు బిఆర్ఎస్ లో చేరబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. అయితే ఈ ప్రచారం మరీ అంత తేలిగ్గా కొట్టి వేసేది కూడా కాదు. ఎందుకంటే దేశ రాజకీయాల్లో టిఆర్ఎస్ పూర్తిస్థాయిలో విస్తరించాలన్న, విజయం సాధించాలన్న ముందు పార్టీకి ప్రజల్లో ప్రచారం ముఖ్యం. జనాల్లోకి పార్టీని తీసుకెళ్లాలంటే ఒక వెల్ నోన్ ఫేస్ ఉంటే చాలా సులువు అవుతుంది. ఆ పని ఒక కేసీఆర్ తోనే సాధ్యం కాకపోవచ్చు. అందుకే అంటి రాయుడిని బిఆర్ఎస్ లోకి ఆహ్వానించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.

READ ALSO : పెళ్లికి రెడీ అవుతున్న అమృత ప్రణయ్…అసలు విషయం ఇదే!

Visitors Are Also Reading