సాధారణంగా కొంత మందికి సినీ ఇండస్ట్రీలోకి వస్తే వారి జీవితాలు మారుతుంటాయి. కొందరి జీవితాలు ఊహించని ఎత్తుకు ఎదిగితే మరికొందరి జీవితాలు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇండస్ట్రీలో ఎదిగిన వారు చాలా మంది కనిపిస్తుంటారు. కానీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్న వారు చాలా తక్కువ మంది కనిపిస్తుంటారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన వారు ఇప్పుడు పూట గడవని స్థితిలో ఉన్నారంటే అది వినడానికి కూడా నమ్మలేకపోతుంటాం. కానీ అది వాస్తవం ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : “ఆనంద్” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా..? ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..?
Advertisement
సినీ ఇండస్ట్రీలో కూడా కొంత మంది ఇబ్బందులతో జీవితాన్ని జీవితాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ఓ సీనియర్ నటి కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. దాదాపు 400 వందల సినిమాల్లో నటించిన ఆ హీరోయిన్ ఇప్పుడు ఆర్థిక స్థోమత సరిగ్గా లేక ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. సీనియర్ నటి జయకుమారి చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం చేరారు. ప్రస్తుతం ఈమె ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు.
Advertisement
Also Read : హైపర్ ఆదిపై మండిపడుతున్న ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్.. ఎందుకంటే..?
తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో దాదాపు 400 లకు పైగా చిత్రాల్లో నటించిన ఈ హీరోయిన్ పరిస్థితి బాగోలేదు. తన రెండు కిడ్నీలు చెడిపోవడంతో మంచానికే పరిమితమై ఉన్నారు. వైద్యానికి డబ్బులు లేక.. ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారు. ఇక తాజాగా చెన్నై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే ఒకప్పుడు బాగా బతికిన జయకుమారి.. ఆ తరువాత సంపాదించిందంతా పోగొట్టుకున్నారు. ప్రస్తుతం తన కుమారుడితో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇక భర్త నాగపట్టినం ఎప్పుడో చనిపోయారు. ఈమెకు ఆర్థిక సహాయం చేసి ఆదుకోండి అని పలువురు నెటిజన్లు కోరుతున్నారు.
Also Read : అనుష్కకు వార్నింగ్ ఇచ్చిన ప్రభాస్.. అందుకోసమేనా..?