టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీ జంట ప్రభాస్-అనుష్క అని చాలా మంది అంటుంటారు. వెండితెరపై వీరు చేసే సందడి ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అనే చెప్పాలి. ముఖ్యంగా మిర్చి, బాహుబలి సిరీస్‌లో వీరు కలిసి నటించిన విషయం తెలిసిందే. కేవలం వెండితెరపై మాత్రమే కాదు.. రీల్ లైఫ్‌లో కూడా వీరు జంటగా కనిపిస్తే చూడాలని అందరూ అనుకుంటున్నారు. ప్రధానంగా బాహుబలి సినిమా షూటింగ్ తరువాత ప్రమోషన్స్‌లలో ఇద్దరూ ఒకరిపై మరొకరు చూపించుకునే కేరింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకుంటారు అనివార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఆయన పెద్దనాన్న కృష్ణంరాజు మరణించడంతో దాదాపు 3 నెలల వరకు ఏ సినిమా షూటింగ్‌లో పాల్గొనని చెప్పుకొచ్చాడు ప్రభాస్. ఇదిలా ఉంటే కొన్నాళ్ల నుంచి ప్రభాస్-అనుష్క బెస్ట్ ఫ్రెండ్స్‌గా కొనసాగుతున్నారు. అనుష్క ప్రభాస్ మాత్రం చాలా హుందాగా బిహేవ్ చేస్తారు. ప్రొడ్యూసర్ తో కానీ డైరెక్టర్లతో కానీ వాళ్ల సినిమాకు సంబంధించి ఏ ఇబ్బందులకు గురి చేయరు. అనుష్క ఒక సినిమా విషయంలో స్క్రిప్ట్ గురించి చెప్పగా ప్రభాస్ నో అంటూ రిజెక్ట్ చేశారట. అనుష్కకు నచ్చడంతో ఆమె సైన్ చేసి సినిమాలో నటించారు. అఫ్ కోర్స్ ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ సినిమా మరేదో కాదు.. వేదం అప్పటి వరకు స్టార్ స్టేటస్ ఉన్న అనుష్క అందులో వ్యభిచారిగా కనిపించే సరికి అందరూ ఆశ్చర్యపోయారు.
Ad
Advertisement
స్టార్ హీరోయిన్‌గా ఉన్న అనుష్క అలా కనిపిస్తే మైనస్ అవుతుందని అంతా భావించారు. ఈ తరుణంలోనే ప్రభాస్ కూడా స్క్రిప్ట్ రిజెక్ట్ చేయాలని చెప్పారట. కానీ అనుష్క మాత్రం కథ నచ్చడంతో ముందుకు వెళ్లింది. ఆమెను ఎవరు వ్యభిచారిగా చూడలేదు. ఆ పాత్రలో వాళ్లు పడిన బాధను మనకు తెలియజేసే అమ్మాయిలా చూశారు. ఇక ఆ పాత్ర చూసిన 60 ఏళ్ల ముసలావిడ హగ్ చేసుకుని బాగా చేశావమ్మా అంటూ పొగిడేసరని ఆ సందర్భాన్ని అనుష్క ఇప్పటికీ మర్చిపోలేను ఇంటర్వ్యూలో చెప్పుకురావడం గమనార్హం. చాలా రోజుల తరువాత అనుష్క నవీన్ పోలిశెట్టి సినిమాతో బిజీగా ఉంది. ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా త్వరలోనే సైట్స్ పైకి రానుందని అంటున్నారు.
Also Read : ఎన్టీఆర్ ‘కొమురం భీముడో’ సాంగ్‌ని ఇలా మార్చారేంట్రా బాబు..!