Home » నాటు నాటు.. పాటకు బామ్మ అదిరిపోయే స్టెప్పులు

నాటు నాటు.. పాటకు బామ్మ అదిరిపోయే స్టెప్పులు

by Sravan Sunku
Published: Last Updated on
Ad

అగ్ర‌ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ సినిమా నుంచి ఇటీవ‌ల విడుద‌లైన ‘నాటు నాటు’ అనే పాట ప్ర‌స్తుతం ఎవ‌రినోట అయిన ఇదే పాట వినిప‌డుతోంది. ఈ పాట తెలుగు ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపుతున్న‌ది. స‌మంతలాంటి సెలబ్రిటీలు కూడ ఈ సాంగ్‌పై అభినంద‌న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. సోష‌ల్ మీడియాలోనైతే చాలా అద్భుత‌మైన స్పంద‌క వ‌స్తున్న‌ది. నెటిజ‌న్లు చాలా మంది ఈ సాంగ్‌ను రీక్రియేట్ చేస్తూ మ‌రీ స్టెప్పులు వేస్తున్నారు. తాజాగా నాటు నాటు సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు వేసిన‌ది ఓ బామ్మ‌.

Also Read: సుక్కు మార్క్…వీళ్ల‌ను ఇలా మార్చేశాడేంటి..!

Advertisement

Advertisement

వ‌య‌స్సు అనేది కేవ‌లం ఒక అంకె మాత్ర‌మేన‌ని, మ‌రోసారి నిరూపిస్తూ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ సాంగ్‌కు ఎంతో ఉత్సాహంగా కాలు క‌దిపిన‌ది. బామ్మ నాటు డ్యాన్స్‌ను అభినందిస్తూ ఓ వీడియోను త‌మ అధికారిక సోష‌ల్ మీడియాలో పంచుకున్న‌ది ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం. బామ్మ‌గారు అంటూ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన‌ది. వీడియో చూసిన నెటిజ‌న్లు బామ్మ‌గారు మీ ఉత్స‌హానికి హ్యాట్సాప్ అని, మీ డ్యాన్స్ కెవ్వు కేక అని ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఈ సినిమా జ‌న‌వ‌రి 07, 2022న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వ్వ‌నున్న‌ది.

Also Read: సింగర్ శ్రీరామ్ పై కుట్ర జరుగుతోందా…ఆ స్క్రీన్ షాట్ లను కావాలనే వైరల్ చేస్తున్నారా…?

Visitors Are Also Reading