Home » మ‌హేశ్ బాబు కెరీర్ బెస్ట్ “ఒక్క‌డు” సినిమాను మిస్ చేసుకున్న‌ స్టార్ హీరో ఎవరో తెలుసా..? ఎలా మిస్ అయ్యిందంటే..?

మ‌హేశ్ బాబు కెరీర్ బెస్ట్ “ఒక్క‌డు” సినిమాను మిస్ చేసుకున్న‌ స్టార్ హీరో ఎవరో తెలుసా..? ఎలా మిస్ అయ్యిందంటే..?

by AJAY
Ad

మ‌హేశ్ బాబు కెరీర్ లో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌లో ఒక్క‌డు సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమాకు గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా భూమిక మ‌హేశ్ బాబుకు జోడీగా న‌టించింది. ఛార్మినార్ బ్యాక్ డ్రాప్ లో సినిమా రావ‌డం సినిమాలోని ఫైట్ లు, పాట‌లు, ప్ర‌కాష్ రాజ్ డైలాగులు ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి. మ‌హేశ్ బాబుకు మొట్ట‌మొద‌ట వ‌చ్చిన మాస్ హిట్ కూడా ఇదే.

Advertisement

ఈ సినిమా అప్ప‌ట్లో రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో మ‌హేశ్ బాబు భూమిక‌ను ప్రేమిస్తాడు. కానీ అప్ప‌టికే ప్ర‌కాష్ రాజ్ భూమిక‌పై మ‌న‌సు పారేసుకుని పెళ్లికి సిద్ద‌మ‌వుతాడు. ప్ర‌కాష్ రాజ్ నుండి భూమిక‌ను కాపాడ‌టానికి తీసుకువ‌చ్చిన మ‌హేశ్ బాబు ఆమెతో ప్రేమ‌లోప‌డిపోతాడు. ఇక సినిమాలో క్లైమాక్స్ ఫైట్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విల‌న్ కోసం మొద‌ట ప్రకాష్ రాజ్ ను సంప్ర‌దించారు.

Advertisement

కానీ బిజీ షెడ్యూల్ కార‌ణంగా ప్రకాష్ రాజ్ మొద‌ట నో చెప్పార‌ట‌. ఆ త‌ర‌వాత చిత్ర‌యూనిట్ హీరో గోపిచంద్ ను సంప్ర‌దించింది. క‌థ గోపిచంద్ కు తెగ‌న‌చ్చ‌డంతో ఆయ‌న ఓకే చెప్పారు. కానీ ఇంత‌లో ప్ర‌కాష్ రాజ్ ఒక్క‌డు సినిమా కోసం మిగ‌తా సినిమాల‌ను ప‌క్క‌న పెడ‌తాన‌ని ద‌ర్శ‌కుడికి ఫోన్ చేసి చెప్పార‌ట‌. దాంతో మ‌ళ్లీ గోపిచంద్ ను ప‌క్క‌న పెట్టి ప్ర‌కాష్ రాజ్ ను ఎంపిక చేశారు. ప్ర‌కాష్ రాజ్ న‌ట‌నను ఇర‌గ‌దీశారు.

okkadu phone number scene

అలా మ‌హేశ్ బాబు గోపిచంద్ కాంబోలో రావాల్సిన ఒక్క‌డు మిస్స‌య్యింది. కానీ ఆ త‌ర‌వాత మ‌హేశ్ బాబు హీరోగా గోపిచంద్ విల‌న్ గా నిజం సినిమా ప్రేక్ష‌కుల మందుకు వ‌చ్చింది. నిజం సినిమా మాత్రం ప్రేక్ష‌కుల‌ను నిరాశ‌ప‌రిచిన సంగ‌తి తెలిసిందే. నిజం సినిమా క‌థ బ‌లంగా లేక‌పోవ‌డం వ‌ల్ల ఫ్లాప్ అయ్యింది. అయితే వీరిద్ద‌రూ ఒక్క‌డు సినిమాలో న‌టించి ఉంటే మ‌రో రేంజ్ లో ఉండేదేమో.

Visitors Are Also Reading