ఇది ఎక్కడ వినని వింత. ఇది ఎక్కడ చూడని వార్త అనే చెప్పొచ్చు. దేవునికి కోపం వస్తే.. ఇలాగే ఉంటుందని అనుకునేవిధంగా ఈ ఘటన జరిగింది. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్‌లో ఉన్న బాలాజీ ఆలయంలో దాదాపు 16 విలువైన అష్టధాతు విగ్రహాలను దొంగలు దొంగిలించారు. దొంగిలించిన వాటిలో 14 విగ్రహాలను వాళ్లు సరిగ్గా 5 రోజుల్లో తిరిగి పూజారి నివాసం వద్దనే ఓ గోనే సంచిలో పెట్టి వదిలివేయడం ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఇదంతా దేవుడి మహిమనో లేక దేవుని మీద ఉన్న భయమో తెలియదు కానీ.. దొంగిలించిన విగ్రహాలు తిరిగి దొరకడం స్థానిక ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Advertisement
యూపీలోని చిత్రకూట్ జిల్లా తరౌన్హా ప్రాంతంలో ఉన్న పురాతన వేంకటేశ్వరస్వామి ఆలయంలో మే 9న 16 అష్టధాతు విగ్రహాలు చోరీకి గురయ్యాయి. ఈ విషయంపై ఆ గుడి పూజారి మహంత్ రాంబాలక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అనూహ్యంగా 5 రోజుల తరువాత దొంగిలించబడిన 16 విగ్రహాల్లో 14 విగ్రహాలు పూజారి మహంత్ రాబాలక్ ఇంటి ముందు ఓ గుర్తుతెలియని గోనె సంచిలో ప్రత్యక్షం కావడం విశేషం. విగ్రహాలతో పాటు ఓ లేఖ కూడా ఉండడం గమనార్హం. ఈ విగ్రహాలను దొంగిలించినప్పటి నుంచి రాత్రి సమయంలో ఎన్నో పీడ కలలు వచ్చాయని.. భయపడి విగ్రహాలను తీసుకొచ్చినట్టు దొంగలు లేఖలో పేర్కొన్నారు. దొరికిన ఆ 14 అష్టధాతు విగ్రహాలను ఆలయ సిబ్బంది నిక్షిప్తం చేయగా.. మిగిలిన రెండు విగ్రహాల కోసం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.
Aslo Read :
Whatsapp: వాట్సప్ వినియోగదారులకు శుభవార్త.. ఇక నుంచి గ్రూపులో సైలెంట్‌గా ఎగ్జిట్ అవ్వొచ్చు
Malware Apps: బీ అలర్ట్.. మీ స్మార్ట్‌ఫోన్ నుంచి ఈ మూడు యాప్స్ వెంటనే తొలగించండి