Home » Malware Apps: బీ అల‌ర్ట్‌.. మీ స్మార్ట్‌ఫోన్ నుంచి ఈ మూడు యాప్స్ వెంట‌నే తొల‌గించండి

Malware Apps: బీ అల‌ర్ట్‌.. మీ స్మార్ట్‌ఫోన్ నుంచి ఈ మూడు యాప్స్ వెంట‌నే తొల‌గించండి

by Anji
Ad

స్మార్ట్ ఫోన్ వినియోగించే వారు జాగ్ర‌త్తగా ఉండండి. మ‌రో మూడు మాల్‌వేర్ యాప్స్ బ‌య‌ట‌ప‌డ్డాయి. గూగుల్ ఆ మూడు యాప్స్‌ను నిషేదించింది. మీరు ఈ యాప్స్‌ను వినియోగించిన‌ట్ట‌యితే వెంట‌నే వాటిని తొల‌గించ‌డం ఉత్త‌మం. గూగుల్ ప్లే స్టోర్ నుండి మూడు యాప్స్‌ను తొల‌గించింది. ఈ మూడు యాప్స్ ను జోకర్ మాల్‌వేర్ ఉన్న‌ట్టు గుర్తించిన గూగుల్ వాటిని ప్లే స్టోర్ నుంచి తొల‌గించింది. యూజ‌ర్లు ఈ యాప్స్ వాడుతున్న‌ట్ట‌యితే వెంట‌నే అన్ ఇన్ స్టాల్ చేయండి. ఈ జోక‌ల్ మాల్‌వేర్‌యాప్ అమాయ‌క యూజ‌ర్ల‌ను వ‌ల‌లో వేసుకుంటుంది. ఎలాంటి స‌మాచారం లేకుండానే ఖ‌రీదైన స‌బ్‌స్క్రిప్షన్ సేవ‌ల‌ను స‌బ్‌స్క్రేబ్ చేసి ఆండ్రాయిడ్ యూజ‌ర్ల డ‌బ్బులు దోచుకుంటుంది. సైబ‌ర్ స‌సెక్యూరిటీ, యాంటివైర‌స్ సంస్థ అయిన క్యాస్ప‌ర్ స్కీ ఈ మూడు డేంజ‌ర‌స్ యాప్స్‌ను గుర్తించింది.

Advertisement

ముఖ్యంగా జోక‌ల్ మాల్‌వేర్ గూగుల్ భద్ర‌తా చ‌ర్య‌ల‌ను అధిగ‌మించి గూగుల్ ప్లే స్టోర్‌లోకి వ‌చ్చింద‌ని.. త‌రువాత యూజ‌ర్ల స్మార్ట్‌ఫోన్‌ల‌పై దాడి చేసి అకౌంట్ల‌ను ఖాళీ చేస్తుంద‌ని Igor Golovin అనే ఆథ‌ర్ రీసెర్చ్ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. Trojan.AndroidOS.Jocker ఫ్యామిలీ నుండి వ‌చ్చిన ట్రోజ‌న్లు టెక్ట్స్ మెసేజెస్ పంపింపి యాంటి ఫ్రాడ్ సొల్యూష‌న్స్ ను దాటుతున్నాయ‌ని రీసెర్చ్‌లో తేలింది. సాధార‌ణంగా జోక‌ర్ మాల్ వేర్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి. అక్క‌డి నుంచి స్కామ‌ర్ల ప‌ని ప్రారంభం అవుతుంది. చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన యాప్స్‌లో హానిక‌ర‌మైన కోడ్స్ ఎంట‌ర్ చేసి మ‌ళ్లీ ప్లే స్టోర్‌లోకి మ‌రోపేరుతో అప్‌లోడ్ చేస్తుంటారు. ఆ త‌రువాత ట్రోజ‌న్లు త‌మ ప‌ని ప్రారంభిస్తుంటాయి. స‌బ్‌స్క్రిప్ష‌న్ ద్వారా అకౌంట్ లో ఉన్న మొత్తాన్ని ఖాళీ చేస్తాయి.

Advertisement

తాజాగా జోక‌ర్ మాల్‌వేర్ నుంచి వెలుగులోకి వ‌చ్చిన మూడు యాప్స్ వివ‌రాల‌ను ప‌రిశీలించిన‌ట్ట‌యితే.. Style Message (com.stylelacat.message around), Blood Pressure App (blood.maodig.raise.bloodrate.monitorapp.plus.tracker.tool.health), Camera PDF Scanner (com.jiao.hdcam.docscanner) పేరుతో ఈ యాప్స్ ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్‌లో ప్ర‌స్తుతం ఈ యాప్స్ మాత్రం అందుబాటులో లేవు. ఇలా గూగుల్ ప్ర‌మాద‌క‌ర‌మైన యాప్స్‌ను తొల‌గించ‌డం కొత్తేమి కాదు. గ‌తంలో కూడా వంద‌ల సంఖ్య‌లో మాల్‌వేర్ ఉన్న యాప్స్ ను తొల‌గించింది. వాటిని వినియోజించ‌క‌పోవ‌డం ఎంతో మంచిది. ముఖ్యంగా ఇలాంటి యాప్స్ బారిన ప‌డ‌కుండా ఉండాలంటే స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు యాప్స్ ఇన్‌స్టాల్ చేసేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. ఎలాంటి ప‌రిస్థితిలో కూడా థ‌ర్డ్ పార్టీ యాప్ స్టోర్ నుండి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోకూడ‌దు. ఏపీకే ఫైల్స్ అస‌లు ఇన్‌స్టాల్ చేయ‌కూడ‌దు. గూగుల్ ప్లే స్టోర్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేసుకున్నా ఒక‌సారి డెవ‌ల‌ప‌ర్ ఎవ‌రు..? రివ్యూస్ ఎలా ఉన్నాయ‌ని చెక్ చేసుకోవడం ఉత్త‌మం.

Also  Read : 

ఈ ఆకుతో 100 మొండి రోగాలను తరిమేయవచ్చు.. ఏంటది..?

నేడే Vivo X80, Vivo X80 Pro స్మార్ట్‌ఫోన్‌ల విడుద‌ల‌.. పూర్తి వివ‌రాలు ఇవే..!

Visitors Are Also Reading