Home » సుధీర్ అసలు పేరు తెలుసా…జబర్దస్త్ కు ముందు ఏం చేశాడో తెలుసా..?

సుధీర్ అసలు పేరు తెలుసా…జబర్దస్త్ కు ముందు ఏం చేశాడో తెలుసా..?

by AJAY
Ad

తెలుగులో చాలా మంది కమెడియన్ల కు లైఫ్ ఇచ్చిన షో జబర్దస్త్. ఈ షో ద్వారా చాలా మంది టీవీ, సినిమా అవకాశాలను అందుకున్నారు. ఈ షో ద్వారా పాపులారిటీ సంపాదించిన వారు ప్రస్తుతం సినిమాల్లో ఫుల్ గా బిజీగా ఉన్నారు. ఇక ఈ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నవారిలో సుడిగాలి సుదీర్ కూడా ఒకరు. మొదట మ్యాజిక్ షో ద్వారా పేరు తెచ్చుకున్నసుడిగాలి సుదీర్ ప్రస్తుతం కమెడియన్ గా రాణిస్తున్నారు. అయితే సుధీర్ గురించి… సుధీర్ బ్యాక్ గ్రౌండ్ గురించి చాలా మందికి తెలియదు. సుధీర్ 198 మే 19న జన్మించాడు. ప్రస్తుతం సుధీర్ కు 34 ఏళ్ల వయస్సు ఉంటుంది.

Advertisement

ఇక జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సుదీర్ ప్రస్తుతం సంవత్సరానికి కోట్లల్లో సంపాదిస్తున్నారు. ముఖ్యంగా ఈ టీవీ లో సుధీర్ ఎక్కువగా షోలు చేస్తూ ఉంటాడు. ఈ షోల‌కు సుధీర్ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ప్ర‌స్తుతం సుదీర్ కు ఎంతో మంది అభిమానులు ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. సుధీర్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నా ఆయ‌న‌ గురించి చాలామందికి తెలియ‌దు. అంతే కాకుండా సుధీర్ అస‌లు పేరుకూడా ఎవ‌రికీ తెలియదు. కానీ సుధీర్ అసలు పేరు సిద్ధూ అని అత‌డి అక్క శ్రీదేవి ఇటీవల ఈటీవీలో ప్రసారమవుతున్న డ్రామా కంపెనీ షోలో బయటపెట్టింది.

Advertisement

అంతేకాకుండా అందరూ చూస్తుండగానే సిద్దు అని పిలిచి ఆశ్చర్యపరిచింది. దాంతో అక్కడ ఉన్న వాళ్లంతా షాకయ్యారు. ఆ తర్వాత సుధీర్ అసలు సిద్ధూనే అని చిన్నప్పటినుండి త‌న తమ్ముడిని ఇంట్లో సిద్దూ అని పిలుస్తారని చెప్పింది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అందరికీ సుధీర్ అని పరిచయం కావడంతో ఆ పేరుతోనే పాపుల‌ర్ అయ్యాడ‌ని ఆమె వెల్లడించింది.

ఇదిలా ఉంటే సుధీర్ హీరోగా కూడా నటిస్తూ తన ఇమేజ్ ను మరింత పెంచుకుంటున్నారు. ఇటీవల ఆయన ప‌లు సినిమాల్లో హీరోగా నటించారు. అంతేకాకుండా ప్రస్తుతం కాలింగ్ సహస్ర అనే సినిమాలో నటిస్తున్నాడు. మ‌రో వైపు త్వ‌ర‌లో ర‌ష్మీ హీరోయిన్ గా సుధీర్ హీరోగా కూడా ఓ సినిమా రాబోతుంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది.

Visitors Are Also Reading