Home » పడిపోయిన బాబర్ ఆజమ్.. నెంబర్ వన్ లోనే టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్..!

పడిపోయిన బాబర్ ఆజమ్.. నెంబర్ వన్ లోనే టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్..!

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా ఏదైనా ఆటలో ఎప్పుడూ ఒక్కరిదే హవా కొనసాగదు. ఒక్కోసారి ఒక్కొక్కరిది హవా కొనసాగుతుంది. తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ని విడుదల చేసింది. జాబితాలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కి భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. బ్యాడ్ ఫామ్ తో సతమతమవుతున్న బాబర్ ఇప్పుడు ప్రపంచలోని టాప్ 3 టీ20 బ్యాట్స్ మెన్స్ నుంచి మిస్సయ్యాడు. అదే సమయంలో భారత తుఫాన్ బ్యాట్స్ మెన్ సూర్య కుమార్ యాదవ్ తన అగ్రస్థానాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు. బాబర్ గత వారం వరకు మూడో స్థానంలో కొనసాగాడు. కానీ న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే అతన్ని అధిగమించి మూడో స్థానంలో నిలిచాడు. 778 పాయింట్లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ నాలుగో స్థానానికి పడిపోయాడు. 

Advertisement

Advertisement

భారత స్టార్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన టీ 20 సిరీస్ లో 124 పరుగులు సాధించాడు. దీంతో సూర్యకుమార్ 890 పాయింట్లు సాధించి మొదటి స్థానంలోనే కొనసాగుతున్నాడు. అదే సమయంలో భారత యువ బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్ 10 స్థానాలు ఎగబాకి 33వ ర్యాంకుకి చేరుకున్నాడు. 

Also Read :  టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపిన్న వయస్కులైన కెప్టెన్లు వీరే..!

న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో విరాట్ కోహ్లీ భాగం కాకపోవడంతో రెండు స్థానాలు కోల్పోయాడు. ఇప్పుడు 13వ స్థానానికి పడిపోయాడు. మరోవైపు బౌలర్ల విషయానికొస్తే.. శ్రీలంకకి చెందిన వనిందు హసరంగ మొదటి స్థానంలో నిలిచాడు. అదే సమయంలో అప్గానిస్తాన్ స్పిన్నర్ రషిద్ ఖాన్ రెండో స్థానంలో ఇంగ్లండ్ ఆటగాడు ఆదిల్ రషీద్ మూడో స్థానంలో ఉన్నారు. టాప్ 10 బౌలర్లలో ఒక్క భారత బౌలర్ కూడా లేకపోవడం గమనార్హం. 

Also Read :  20 ఏళ్ల రికార్డును చెరిపేసిన వార్నర్.. 1043 రోజుల తరువాత సెంచరీ..!

Visitors Are Also Reading