నాన్నే లోకం.. ఆయనే సర్వస్వం.. తనకంటూ ఒక జీవితం ఉందని మరిచిపోయిన గొప్ప కుమారుడు నందమూరి హరికృష్ణ. ఆయన నటించింది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ నటుడిగా హరికృష్ణ ప్రత్యేక ముద్ర వేసుకున్నారనే చెప్పవచ్చు. ఇవాళ నందమూరి హరికృష్ణ 66వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు. ఈ అస్తిత్వం మీరు.. ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు అంటూ ఓ ఫోటోను షేర్ చేశాడు. ఇక మరోవైపు హరికృష్ణ రెండో కుమారుడు నందమూరి కళ్యాణ్‌రామ్ కూడా ఈ ఫోటోను ట్వీట్ చేశాడు. తమ తండ్రిని స్మరించుకుంటూ నందమూరి అన్నదమ్ములు చేసిన ట్వీట్లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
Advertisement
మీ 66వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ… pic.twitter.com/C9fZeHn8tP
— Jr NTR (@tarak9999) September 2, 2022
నటుడిగా రాజకీయ వేత్తగా తెలుగు ప్రజలకు పరిచయం అయిన హరికృష్ణ 1956 సెప్టెంబర్ 02వ తేదీన నందమూరి బసవతారకం, తారకరామారావు దంపతులకు నాలుగవ కుమారుడిగా జన్మించారు. అన్న వారసుడిగా నందమూరి వంశంలో అందరికన్నా ముందే సినిమాల్లోకి వచ్చాడు. 1967లో బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు హరికృష్ణ. ఆ తరువాత ఎన్టీఆర్ కోసం సినిమాలనే త్యాగం చేశాడు. 1982లో టీడీపీ ఆవిర్భవించినప్పుడు ఎన్టీఆర్ చేపట్టిన చైతన్య రథానికి ఆయనే రథసారథి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50వేల కిలోమీటరల్ వరకు చైతన్య రథయాత్రలో పాల్గొన్నారు. రథానికి డ్రైవర్‌గా పని చేస్తూ.. తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచారు.
Advertisement
ఇది కూడా చదవండి : పవన్ కళ్యాణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. మెగాస్టార్ ట్వీట్ వైరల్..!
బాలనటుడిగా శ్రీకృష్ణావతారం సినిమాలో బాలకృష్ణుడి పాత్రతో రంగ ప్రవేశం చేశారు. ఇందులో నాన్న ఎన్టీఆర్‌తో కలిసి నటించాడు. దక్షిణాదిలో సినీ రంగ ప్రవేశం చేసిన తొలి నట వారసుడు కూడా హరికృష్ణ కావడం విశేషం. 2018 ఆగస్టు 29న నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో ఓ ఫంక్షన్ కి వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అంతకు ముందు ఇదే ప్రాంతంలో నందమూరి జానకిరామ్ కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించాడు. రెండో కుమారుడు ఇటీవలే బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. చిన్న కుమారుడు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లేవల్‌లో హిట్ సాధించాడు. ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు.
ఇది కూడా చదవండి : RANGA RANGA VAIBHAVANGA MOVIE REVIW : వైష్ణవ్ తేజ్ “రంగరంగవైభవంగా” సినిమా రివ్య్వూ..!