కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ కి ఇవాళ కర్ణాటక ప్రభుత్వం కర్నాటక రత్న పురస్కార ప్రదానోత్సవం నిర్వహించింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో కన్నడ రాజ్యోత్సవ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరయ్యారు.
Advertisement
ముఖ్యంగా ఎన్టీఆర్ కన్నడంలో అద్భుతమైన ప్రసంగం చేశారు. ముందుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కన్నడ ప్రజలకు, కన్నడ రాజ్యోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత పునీత్ రాజ్ కుమార్ పై ప్రశంసల వర్షం కురిపించారు ఎన్టీఆర్. పునీత్ నవ్వులో ఉన్న స్వచ్ఛతను మరెక్కడా చూడలేదన్నారు. అహం, అహంకారాన్ని పక్కకు పెట్టి యుద్ధం చేయకుండానే రాజ్యాన్ని జయించిన వ్యక్తి పునీత్ రాజ్ కుమార్ అన్నారు. ఆయన చేసిన సేవలు అద్భుతం. రాజ్ కుమార్ తో తాను అప్పూకు ఓ స్నేహితుడిగానే ఇక్కడికి వచ్చాను. మీ అందరి అభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
Advertisement
Also Read : సమంత అనారోగ్య సమస్యల వల్ల వారికి అన్ని కోట్ల నష్టమా..?
పునీత్ సూపర్ స్టార్ గా, గాయకుడిగా, మంచి భర్తగా, తండ్రిగా, స్నేహితుడిగా తనదైన ముద్ర వేశారని గుర్తు చేశారు. ముఖ్యంగా పునీత్ కి కర్నాటక రత్న ప్రదానం చేయడంతో ఈ పురస్కారానికి ఓ సార్థకత చేకూరిందన్నారు. ఇంత గొప్ప కార్యక్రమంల పాల్గొనే అవకాశం కల్పించిన కర్ణాటక ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పునీత్ ఫ్యామిలీ నన్ను ఓ కుటుంబ సభ్యునిగా ఆదరించినందుకు వారికి రుణపడి ఉంటానని చెప్పారు ఎన్టీఆర్. దీంతో ఇక ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.