Home » సమంత అనారోగ్య సమస్యల వల్ల వారికి అన్ని కోట్ల నష్టమా..?

సమంత అనారోగ్య సమస్యల వల్ల వారికి అన్ని కోట్ల నష్టమా..?

by Anji
Ad

టాలీవుడ్ నటి సమంత ‘మయూసైటిస్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయము తెలిసిందే. ఈమె వ్యాధికి గురి కావడం అభిమానులను కలత చెందిస్తొంది. మయోసైటిస్ అనే వ్యాధిని డాక్టర్లు ప్రాణాంతక వ్యాధిగా చెబుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే భవిష్యత్తులో చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. సమంత ఆరోగ్య పరిస్థితి పై ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఆమె నటించిన సినిమాల పరిస్థితి దారుణంగా ఉందంటూ చర్చించుకుంటున్నారు.  సమంత నటించిన యశోద సినిమా ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమెకున్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా భారీ ఎత్తున యశోద సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు మూవీ మేకర్స్. 

Advertisement

ఒక యూనివర్సల్ సబ్జెక్టు అవ్వడం వల్ల యశోద సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని ప్రతి ఒక్కరూ నమ్మకంతో ఉన్నారు. సినిమా ఎంత బాగున్న ప్రమోషన్ కార్యక్రమాలు సరిగ్గా చేయకపోతే ఫలితము మరోలా ఉంటుంది. మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంలో శకుంతలం సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. సమంత అనారోగ్య పరిస్థితి కారణంగా ఆ సినిమా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. హిందీలో ఈమె రెండు సినిమాలకు కమిట్ అయింది. సినిమాను తాప్సీ నిర్మిస్తోంది. మరోటి వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. 

Advertisement

Also Read :  కేవలం దానికోసమే కోట్లు ఖర్చు పెడుతున్న పవిత్ర లోకేష్..!!

ఇలా సినిమాలకు, వెబ్ సిరీస్ లకు కవిత అయిన సమంత ఆమె అభిమానులు చేస్తున్నారు. ఫ్యూచర్లో ఆమె షూటింగ్లో పాల్గొంటుందా లేదా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సమంత ప్రస్తుతం అనారోగ్యంతో బెడ్ పై ఉండటం వల్ల నిర్మాతలకు కోట్లలో నష్టమంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఒక సినిమా చేసి దానిని ప్రమోట్ చేయకుంటే ఆ సినిమా కచ్చితంగా నష్టం తప్పదు. అదేవిధంగా ఒక హీరో లేదా హీరోయిన్ డేట్ ల నుంచి షూటింగ్ కి హాజరు కాకపోయినా నిర్మాతకు భారీగానే నష్టం కలుగుతుంది. చాలానే నష్టాలు వస్తున్నాయి. కోట్లలో నష్టాలు నమోదు అవుతున్నట్టు సమాచారం.

Also Read :  ప్రధానిని మోడీని పొగిడిన విశాల్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!

Visitors Are Also Reading