Telugu News » Blog » NTR30:నందమూరి ఫ్యాన్స్ కు ఇక పూనకాలే.. అలాగే బ్యాడ్ న్యూస్..!

NTR30:నందమూరి ఫ్యాన్స్ కు ఇక పూనకాలే.. అలాగే బ్యాడ్ న్యూస్..!

by Sravanthi Pandrala Pandrala
Ads

ఆర్ఆర్ఆర్ మూవీతో పాటు ఇండియా లెవెల్ లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ మళ్లీ ఎన్టీఆర్ 30 మూవీతో మన ముందుకు రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. నూతన సంవత్సరం సందర్భంగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సమయం కోసం ఎంతో ఎదురు చూస్తున్న తారక్ ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు .

Advertisement

also read:తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి అంటే..?

Advertisement

కానీ మరో బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు యూనిట్ ప్రకటించింది. సినిమా విడుదల తేదీని ప్రకటించడం మంచిదే కానీ ఎన్టీఆర్ ను ఈ ఏడాదిలో చూడలేకపోతున్నామని బాధ ఫ్యాన్స్ లో కలిగింది. ఎన్టీఆర్ ను అభిమానులు తెరపై చూడాలంటే 16 నెలలు వేచి ఉండాల్సి వస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ పెరగడంతో ఈ సినిమాని కొరటాల శివ పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అందుకే సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంత ఆలస్యమైంది.

స్క్రిప్టులో అనేక మెరుగులు దిద్ది అవుట్ లుక్ పర్ఫెక్ట్ గా వచ్చేలా సన్నద్ధమయ్యారు కొరటాల శివ. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఎన్టీఆర్ ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనున్నాడు . పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ఈ చిత్రంపై అనేక అంచనాలున్నాయి. అంతేకాకుండా ఈ మూవీలో కథానాయకగా బాలీవుడ్ బ్యూటీ జాన్విని ఫైనల్ చేసినట్టు సమాచారం. ఏది ఏమైనా ఎన్టీఆర్ 30 గురించి ఈ అప్డేట్ రావడంతో ఆయన అభిమానులు ఎంతో ఆనంద పడుతున్నారు.

Advertisement

also read: