Home » టాలీవుడ్ లో సక్సెస్ సాధించి దూసుకుపోతున్న అన్నదమ్ములు ఎవరో తెలుసా ?

టాలీవుడ్ లో సక్సెస్ సాధించి దూసుకుపోతున్న అన్నదమ్ములు ఎవరో తెలుసా ?

by Ajay

ఒకే ఇంట్లో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు హీరోలుగా ఉండ‌టం అంటే అదృష్టం అనే చెప్పాలి. కానీ ఇండ‌స్ట్రీలో ఒక‌రు రానిస్తే మ‌రొక‌రికి కూడా టాలెంట్ ఉంటే ఖ‌చ్చితంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స‌క్సెస్ అవుతుంటారు. అలా మ‌న టాలీవుడ్ లో పలువురు అన్న‌ద‌మ్ములు హీరోలుగా అల‌రిస్తున్నారు, అల‌రించారు. మ‌రి ఆ హీరో బ్ర‌ద‌ర్స్ ఎవ‌రో ఇప్పుడు చూద్దామా..

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగారు. చిరు సినిమాల్లో స‌క్సెస్ అయిన తర‌వాత ఆయన సోద‌రులు ప‌వ‌న్ మ‌రియు నాగ‌బాబు కూడా ఎంట్రీ ఇచ్చారు. వారిలో ప‌వ‌న్ సినిమాల్లో స్టార్ హీరోగా అల‌రిస్తుండ‌గా నాగ‌బాబు బుల్లితెర‌పై మెప్పిస్తున్నారు.

బాల‌క్రిష్ణ‌, హ‌రికృష్ణ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తండ్రికి త‌గ్గ త‌య‌న‌యులు అనిపించుకున్నారు. బాల‌య్య ఇప్ప‌టికీ వ‌రుస సినిమాలు చేస్తుండ‌గా హ‌రిక్రిష్ణ రెండు మూడు సినిమాలే చేసినా త‌న‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

నంద‌మూరి కుటుంబం నుండే ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మ‌రో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు ఎన్టీఆర్, క‌ల్యాణ్ రామ్. ఈ ఇద్ద‌రు హీరోలు ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు.

మెగామేన‌ల్లుడుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సాయిధ‌ర‌మ్ తేజ్ వ‌రుస చిత్రాల‌తో అల‌రిస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఉప్పెన సినిమాతో సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

దగ్గుబాటి ఫ్యామిలీ నుండి సురేష్ బాబు కుమారుడు రానా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డ‌గా హీరోగా మరియు విల‌న్ గా అల‌రిస్తున్నాడు. ఇప్పుడు సురేష్ బాబు రెండో కుమారుడు అభిరామ్ కూడా ఎంట్రీకి సిద్దం అవుతున్నాడు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా అల‌రిస్తున్నాడు. రీసెంట్ గా పుష్ప‌తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక అల్లు అర్జున్ త‌మ్ముడు శిరీష్ కూడా వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ చేతినిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక రౌడీ త‌మ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవ‌ర‌కొండ కూడా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు.

Also Read: సంక్రాంతి సినిమాల ప్రీరిలీజ్ బిజినెస్ ఇదే.. అల్లుళ్లు ఎవరంటే…?


You may also like