సినిమా ఇండస్ట్రీ అంటే ఓ బిజినెస్.. ఒకరి కోసం మరొకరు ఎట్టి పరిస్థితిలో త్యాగం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే.. ఎవరి ఇమేజ్ వారిది. ఎవరి స్టార్‌డమ్ వారిది. ఎవ్వరూ కూడా మరొకరి కోసం ఆలోచించే పరిస్థితి మచ్చుకు కూడా కనిపించదు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ త్యాగం చేశారు. నమ్మడానికి ఇది కొంచెం కష్టం అయినప్పటికీ ఇది మాత్రం వాస్తవమేనట. ఒక హీరో కోసం మరొక హీరో త్యాగం చేయడం బహుశా తెలుగు సినీ రంగంలో ఇదేనేమో. ఈ విషయం తెలుగు చలన చిత్రరంగంలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
Also Read : బాలయ్య బాబు 90’s పేపర్ కటింగ్స్! ఒక్కో ఫోటో ఒక్కో ఆణిముత్యం!
Advertisement
అసలు ఏమి జరిగిందంటే.. అది 1973-74 మధ్య కాలం. ఈ సమయంలో సూపర్ స్టార్ కృష్ణ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను ఇతి వృత్తంగా తీసుకుని సినిమా రూపొందించారు. ఈ చిత్రం భారీ సక్సెస్ సాధిస్తుంది. ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో శత దినోత్సవాలతో పాటు పలు థియేటర్లలో 365 రోజుల పాటు ఆడి, సరికొత్త రికార్డులు సృష్టించింది. అప్పటివరకు ఉన్న సినిమా రికార్డుల్లో సరికొత్త ఒరవడికి కూడా నాంది పలికింది. ఈ సినిమాలో కలిసి నటించిన విజయ నిర్మల కృష్ణలు పెళ్లి కూడా చేసుకున్నారు.
Advertisement
ఆ తరువాత ఇదే సబ్జెక్ట్‌తో దర్శకుడు దుక్కిపాటి మధుసూదనరావు అన్నగారిని కలిశారు. మనం కూడా అల్లూరి జీవిత విశేషాలతో సినిమా తీయాలని ఎన్టీఆర్ అనుకున్నారు. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా అది సాకారం కాలేదు. ఈ లోగా కృష్ణ తీసేశాడు. అయినప్పటికీ మనం తీద్దామని స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని మధుసూదన్‌రావు ఎన్టీఆర్‌ను కలిశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో అల్లూరిని మించిన తెలుగు నాయకుడు ఎవ్వరూ లేరని.. ఎన్టీఆర్ కు ఈ పాత్రపై ఎంతో ప్రేమ ఉంది.
సూపర్ స్టార్ కృష్ణ అప్పటికే నటించడం.. అది హిట్ కావడంతో మధుసూదనరావు చేసిన ప్రతిపాదనకు ఎన్టీఆర్ నో చెప్పారట. అంతేకాదు మన తెలుగు నటుడికి పోటీ మేము చేయడమా..? అని ప్రశ్నించారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ ఆ పాత్రకు దూరంగానే ఉన్నారు. చాలా మంది ఈ చిత్రం కథను కొద్దిగా మార్చి తీద్దామని ప్రతిపాదించినా చారిత్రక విషయాలను వక్రీకరించడాన్ని ఒప్పుకునే వారు కాదు. అందుకే ఎన్టీఆర్ అల్లూరి పాత్రను త్యాగం చేశారు.
అన్నగారి మనసులో మాత్రం.. అల్లూరి పాత్రపై ప్రేమ అలాగే ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అవకాశం కోసం వేచి చూసి.. మోహన్‌బాబు, ఎన్టీఆర్‌తో తీసిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో అల్లూరి పాత్రను ఓ పాట రూపంలో పెట్టారు. అప్పుడు అన్నగారి కోరిక తీరిందట.
Also Read : బజర్దస్త్ నరేష్ వయస్సు ఎంతో తెలుసా..?