ఎన్టీఆర్ తెలుగు సినీ రంగంలో అగ్ర తారగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ మాములుది కాదు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత పాన్ ఇండియా రేంజ్ లో పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ కు అవకాశాలు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. సినిమా ఆఫర్స్ లెక్కలేనన్ని క్యూ లో ఉంటె.. యాడ్స్ తో కూడా మన సింహాద్రి ఫుల్ బిజీగా ఉంటున్నారు.
Advertisement
ఎన్టీఆర్ రేంజ్ గ్లోబల్ లెవెల్ లో ఉండడంతో, ఆయనతో బ్రాండ్ ప్రమోటింగ్ చేయించుకోవడానికి పలు దిగ్గజ వ్యాపార కంపెనీలు సైతం క్యూలు కడుతున్నాయి. ఇప్పటికే పలు బ్రాండ్ ప్రమోటింగ్స్ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తాజాగా మెక్ డొనాల్డ్స్ సంస్థకు కూడా ప్రమోటింగ్ చేస్తున్నారు.
Advertisement
ఇందుకోసం ఆయన భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. 30 సెకండ్ల వ్యవధి ఉండే ఒక్క యాడ్ కోసం ఆయన సుమారు 8 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సినీ ఫక్కీ లో టాక్ వినిపిస్తోంది. ఓ మీడియం హీరో ఫుల్ లెంగ్త్ సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ ను ఎన్టీఆర్ ఒక్క యాడ్ కోసం తీసుకుంటున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “దేవర” సినిమాలో ఎన్టీఆర్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
మరిన్ని ముఖ్య వార్తలు:
ఒకప్పటి స్టార్ హీరోయిన్ సింధు తులాని గుర్తుందా ? ఇప్పడేలా మారిపోయిందంటే ?
అంబానీ డ్రైవర్ నుండి కుక్ వరకు వారి జీతం ఎంతో తెలుసా?
“మీ ఐరెన్ లెగ్ వల్లే టీం ఇండియా ఓడిపోయింది” అంటూ అనుష్క శర్మని తిట్టిపోస్తున్న నెటిజన్స్!