ఎన్టీ రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు. త్వరలో ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా పరిచయం కాబోతున్నారు. ఇలా ఉండగా ఎన్టీఆర్ రియల్ లైఫ్ విషయానికి వస్తే 2011 మే 6న అంగరంగ వైభవంగా లక్ష్మీప్రణతి ని వివాహం చేసుకున్నాడు. ఎన్టీఆర్ ప్రణతిల వివాహం ఎంతో ఘనంగా హైదరాబాద్ లో జరిగింది. అప్పట్లో వీరి వివాహానికి చేసిన ఖర్చు వేసిన మండపం హాట్ టాపిక్ గా నిలిచాయి.
ALSO READ : పెళ్లికి ముందు అమల నాగార్జునతో కలిసి నటించిన సినిమాలు- వాటి రిజల్ట్స్!
Advertisement
ఇక ఎన్టీఆర్ ప్రణతిల వివాహం కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం… ఎన్టీఆర్ ప్రణతిల వివాహం కోసం 160 మీటర్ల ఎత్తైన కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు ఈ కళ్యాణమండపానికి 18 కోట్ల వరకు ఖర్చు అయినట్టు తెలుస్తోంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ ఈ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ప్రణతిల వివాహం కి మొత్తం 10 వేల మంది బంధుమిత్రులు స్నేహితులు హాజరయ్యారు.
Advertisement
టాలీవుడ్ సింగర్ గీత మాధురి కృష్ణ చైతన్య ఎన్టీఆర్ ప్రణతిల వివాహం కోసం ఓ స్పెషల్ సాంగ్ పాడారు. అంతేకాకుండా దేశవిదేశాల నుండి వస్తున్న అతిథుల కోసం ఖరీదైన లక్సరీ హోటల్ బుక్ చేశారు. ఇక ఎన్టీఆర్ పెళ్లి పత్రిక విషయానికి వస్తే సింపుల్ గా సాంప్రదాయబద్దంగా ముద్రించారు. ఈ పెళ్లి పత్రిక లో ఎన్టీఆర్ తాత రామారావు పెళ్లి పత్రిక ను కూడా జత చేశారు.
అదేవిధంగా లక్ష్మీ ప్రణతి తాతగారి పెళ్లి పత్రికలు కూడా ఈ పత్రికలో జతచేశారు. ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిలను ఆశీర్వదించడానికి టాలీవుడ్ దిగ్గజాలు రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ పెళ్లికి హాజరయ్యారు. అదేవిధంగా ఈనాడు అధినేత రామోజీరావు సైతం పెళ్లికి హాజరయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు లాంటి సీనియర్ నటులు వచ్చి ఎన్టీఆర్ ప్రణతి జంటను ఆశీర్వదించారు. అంతే కాకుండా పలువురు టాలీవుడ్ హీరోలు హీరోయిన్లు సైతం హాజరై ఎన్టీఆర్ ప్రణతి తో ఫోటోలు దిగారు.